Share News

Bengaluru Language Controversy: మర్యాదగా హిందీలో మాట్లాడకపోయావో.. బెంగళూరులో ఉండలేవు.. ఆటో డ్రైవర్‌పై ఓ వ్యక్తి..

ABN , Publish Date - Apr 19 , 2025 | 07:48 PM

Bengaluru Auto Ride Language Controversy: బెంగళూరు వీధుల్లో ఓ ఆటో డ్రైవర్ విషయంలో జరిగిన తాజా వివాదం మరోసారి హిందీ భాషాధిపత్యాన్ని తెరమీదకు తెచ్చింది. 'బెంగళూరులో ఉండాలంటే హిందీలో మాట్లాడు' అంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగడంతో సౌత్ ఇండియన్ భాషలు, సంస్కృతులపై హిందీ మాట్లాడే వారి ఆధిపత్య ధోరణిని బట్టబయలు చేసినట్లయింది.

Bengaluru Language Controversy: మర్యాదగా హిందీలో మాట్లాడకపోయావో.. బెంగళూరులో ఉండలేవు.. ఆటో డ్రైవర్‌పై ఓ వ్యక్తి..
Bengaluru Hindi Kannada Auto Driver Controversy

Bengaluru Auto Ride Hindi Kannada Language Controversy: నూతన జాతీయ విద్యావిధానంలో ప్రవేశ పెట్టిన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ.. మరోమారు హిందీ వ్యతిరేకత అంశం చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్‌ హిందీ మాట్లాడేందుకు నిరాకరించడంతో.. ఓ యువకుడు 'మర్యాదగా హిందీలో మాట్లాడు.. లేదంటే ఇక్కడే ఉండే హక్కు నీకు లేదంటూ' స్థానికుడినే బెదిరించడం వివాదానికి తెరలేపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


"బెంగళూరులో ఉండాలనుకుంటే హిందీలో మాట్లాడు" అని ఒక ఆటో డ్రైవర్‌తో యువకుడు బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో యువకుడు కోపంగా డ్రైవర్‌తో హిందీలో మాట్లాడమని చెబుతుండగా.. డ్రైవర్ "నువ్వు బెంగళూరులో ఉన్నావు, కన్నడలో మాట్లాడు. నేను హిందీలో మాట్లాడను" అని బదులిచ్చాడు. దీంతో ఆ యువకుడు మరింత ఆగ్రహం ఊగిపోతూ కనిపించాడు.


ఈ వీడియో చూసి దక్షిణాది ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ఫైర్ అవుతున్నారు. ఇప్పుటికే సౌత్ లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు వలస వచ్చినవారు హిందీలో మాట్లాడమని ఒత్తిడి చేయడం స్థానికులకు నచ్చడం లేదు. వారు మా భాష, సంస్కృతులను తక్కువ చేసి మాట్లాడుతుంటే ఊరుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఎక్స్ లో ఓ యూజర్ 'సౌత్‌ లో ఉంటూ మా భాషలు నేర్చుకోకుండా, మమ్మల్ని హిందీ నేర్చుకోమని బెదిరిస్తారు. ఇది అహంకారం కాకపోతే మరేమిటి?' అంటూ ఆవేదనతో పోస్ట్ చేశాడు. హిందీ భాషతో తమకెలాంటి సమస్య లేదని.. ప్రతి భాషకు తమదైన ప్రత్యేకత, సంస్కృతులు ఉంటాయని.. అది మర్చిపోయి ఇలా అజమాయిషీ చలాయించడాన్ని.. బలవంతంగా తమపై హిందీ భాషను రుద్దేందుకు చేసే ప్రయత్నాలను తప్పు పడుతున్నామని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా రాష్ట్రాల్లో నివసించడానికి వచ్చి మా భాషను గౌరవించని వాళ్లు ఇక్కడ ఉండటానికి అర్హులా? అని కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందీ కేవలం ఒక రాష్ట్ర భాష మాత్రమే. జాతీయ భాష కాదని గుర్తుచేస్తున్నారు.


Read Also: Delhi Men's Satyagraha : భార్యలకేనా హక్కులు.. భర్తలకు లేవా.. దయచేసి మగాళ్లకూ రక్షణ కల్పించండి..

Elon Musk: చైనా కాదు.. ఎట్టకేలకు భారత్ రానున్న ఎలాన్ మస్క్..కారణమిదేనా..

Chhattisgarh: ఏ కాలంలో ఉన్నార్రా.. ఇంత అరాచకమా..

Updated Date - Apr 19 , 2025 | 09:08 PM