Home » Hindi
ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే తాము వ్యతిరేకించామని, అలాగని తాము హిందీకి వ్యతిరేకులం కాదని ఉద్దవ్ ఠాక్రే...
ఫడ్నవిస్ సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వం ఏప్రిల్ 16న జారీ చేసిన ప్రభుత్వ తీర్మానం (జీఆర్) ప్రకారం 1 నుంచి 5వ తరగతి వరకూ ఇంగ్లీషు, మరాఠీ మీడియం స్కూళ్లలో హిందీ తప్పనిసరి. అయితే దీనిపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో జూన్ 17న సవరించిన జీఆర్‌ను జారీ చేసింది.
1981లో విడుదలైన తన చిత్రం 'ఏక్ దుజే కేలియే'ను ప్రస్తావిస్తూ ఆ సమయంలో ఎలాంటి ఇంపొజిషన్ లేకుండానే హిందీని నేర్చుకున్నామని నటుడు కమల్ హాసన్ తెలిపారు. అదొక ఎడ్యుకేషన్ అని అన్నారు. పంజాబీ, కర్ణాటక, ఆంధ్ర భాషలన్నా తనకు అభిమానమేనని చెప్పారు.
మహారాష్ట్ర పాఠశాలల్లో మూడో భాషగా హిందీని తప్పనిసరిచేసే నిర్ణయాన్ని ప్రభుత్వంపై తీవ్ర విమర్శల మధ్య వాయిదా వేసింది. భాషా ప్యానెల్ వ్యతిరేకతతో పాటు ప్రజా విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ ఆలోచనలో పడింది
భాషా వివాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వివరణ ఇచ్చారు. మరాఠీ అనేది చర్చనీయాంశమే కాదని, అందరూ తప్పనిసరిగా నేర్చుకావాలని, వేరే భాషలు నేర్చుకోవడం వారి వ్యక్తిగత ఎంపిక అని అన్నారు.
Bengaluru Auto Ride Language Controversy: బెంగళూరు వీధుల్లో ఓ ఆటో డ్రైవర్ విషయంలో జరిగిన తాజా వివాదం మరోసారి హిందీ భాషాధిపత్యాన్ని తెరమీదకు తెచ్చింది. 'బెంగళూరులో ఉండాలంటే హిందీలో మాట్లాడు' అంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగడంతో సౌత్ ఇండియన్ భాషలు, సంస్కృతులపై హిందీ మాట్లాడే వారి ఆధిపత్య ధోరణిని బట్టబయలు చేసినట్లయింది.
ప్రధానమంత్రి కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరూ హిందీని అంగీకరించాలని చెప్పడం లేదని, డీఎంకే కూటమి నేతలు నేతలు చేస్తున్న నిరసనల్నీ వృథా అని అన్నామలై అన్నారు.
హిందీ, ఇతర భారతీయ భాషల మధ్య ఎప్పుడూ పోటీ ఉండదని, అవి మిత్ర భాషలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
హిందీ భాష దేశాన్ని ఏకం చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో రెండు దశాబ్దాల తర్వాత ఓ హిందీ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. గిరిజన సంస్థ హ్మార్ స్టూడెంట్స్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌ఏ) మంగళవారం సాయంత్రం చురచంద్‌పూర్ జిల్లాలోని రెంగ్‌కాయ్ (లంకా)లో హిందీ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ప్లాన్ చేసింది.