Maharashtra: మహారాష్ట్రలో హిందీ తప్పనిసరి వాయిదా
ABN , Publish Date - Apr 23 , 2025 | 03:30 AM
మహారాష్ట్ర పాఠశాలల్లో మూడో భాషగా హిందీని తప్పనిసరిచేసే నిర్ణయాన్ని ప్రభుత్వంపై తీవ్ర విమర్శల మధ్య వాయిదా వేసింది. భాషా ప్యానెల్ వ్యతిరేకతతో పాటు ప్రజా విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ ఆలోచనలో పడింది

ముంబై, ఏప్రిల్ 22: మహారాష్ట్ర పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీ తప్పనిసరిని ఆ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజులపాటు వాయిదా వేసింది. హిందీ తప్పనిసరిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న వేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే ప్రకటించారు. పాఠశాలల్లో హిందీ తప్పనిసరిని కొన్ని రోజుల పాటు వాయిదా వేశామని ఆయన చెప్పారు. త్వరలో మరో కొత్త తీర్మానం తీసుకొస్తామని తెలియజేశారు. కాగా, మహారాష్ట్ర పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని తప్పనిసరి అన్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర భాషా ప్యానెల్ కూడా వ్యతిరేకించింది.