Home » Karnataka News
బెంగళూరులో ఉన్న అనధికారిక పాకిస్థానీయులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి పరమేశ్వర్ తెలిపారు. జాతీయ భద్రతపై మరిన్ని కఠిన నిర్ణయాలు అవసరమని ఆయన పేర్కొన్నారు
Bengaluru Auto Ride Language Controversy: బెంగళూరు వీధుల్లో ఓ ఆటో డ్రైవర్ విషయంలో జరిగిన తాజా వివాదం మరోసారి హిందీ భాషాధిపత్యాన్ని తెరమీదకు తెచ్చింది. 'బెంగళూరులో ఉండాలంటే హిందీలో మాట్లాడు' అంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగడంతో సౌత్ ఇండియన్ భాషలు, సంస్కృతులపై హిందీ మాట్లాడే వారి ఆధిపత్య ధోరణిని బట్టబయలు చేసినట్లయింది.
మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో జరిగిన అవకతవకల విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని పూర్వపు మైసూరు జిల్లాధికారి ప్రస్తుతం రాయచూరు ఎంపీగా ఉన్న జీ కుమార్‌నాయక్ స్పష్టం చేశారు. బుదవారం నగరంలో విలేకరులతో మాట్లాడిన కుమార్ నాయక్, ముడా అవినీతి వ్యవహారానికి సంబంధించి లోకాయుక్త నుంచి తనకు ఎలాంటి సమాచారం గాని నోటీసు అందలేదన్నారు.
షెడ్యూల్డు కులాల వర్గీకరణకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రయోగాత్మకంగా డేటా సేకరించేందుకు హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి నేతృత్వంలో
మంగళూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మెయిదీన్ బవ సోదరుడైన ముంతాజ్ అలీ ఆదివారం తెల్లవారుజామున 3 గంటలలో తన ఇంటి నుంచి కారులో బయలుదేరాడని, 5 గంటల సమయానికి కులూర్ వంతెన వద్ద ఆగారని చెబుతున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానానికి అత్యంత ఆప్తుడిగా ముద్రపడిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకేసులో దాదాపు నెలరోజులు గా మౌనంగానే ఉన్న ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ సుమలత(Film actress, former MP Sumalatha) మౌనం వీడారు. నటుడు దర్శన్‌ను సుమలత పెద్దకొడుకుగా భావించేవారు. హత్యకేసులో దర్శన్ ఎ-2 నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మేరకు సుమలత ఏవిధంగా స్పందిస్తారనేది కుతూహలంగా ఉండేది.
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్‌కు రంగం సిద్దమైంది. మే 31వ తేదీ అంటే శుక్రవారం తెల్లవారుజామున జర్మనీ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు చేరుకోనున్నారు. ఆ క్రమంలో కెంపె గౌడ ఎయిర్ పోర్ట్‌లో ప్రజ్వల్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కర్ణాటకలో గల గడగ్ ప్రాంతానికి చెందిన ప్రకాష్ మొదటి భార్య కుమారుడు వినాయక్. వినాయక్ తల్లి కాలం చేసిన తర్వాత ప్రకాష్ మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. అయినప్పటికీ కొనుగోలు చేసిన స్థలాలు, ప్లాట్లు వినాయక్ పేరు మీద రాశాడు. అంతవరకు బానే ఉంది. గత ఐదారునెలల నుంచి పరిస్థితి మారింది.
తన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యపై మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి చేసిన చేసిన ‘క్యాష్ ఫర్ పోస్టింగ్’ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. ఆయనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.