Share News

World War 3: ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధ భయం.. వార్ వస్తే ఈ దేశాలు సేఫ్!

ABN , Publish Date - Jun 24 , 2025 | 06:20 PM

ప్రపంచ దేశాలను ఇప్పుడు యుద్ధ భయం పట్టుకుంది. ఎప్పుడు ఎవరు ఏ దేశం మీదకు యుద్ధానికి బయలుదేరుతారో చెప్పలేని పరిస్థితి. యుద్ధాల వల్ల శాంతి కరువై, సొంతవాళ్లను పోగొట్టుకొని ఎంతో మంది రోడ్డున పడుతున్నారు.

World War 3: ప్రపంచాన్ని వణికిస్తున్న యుద్ధ భయం.. వార్ వస్తే ఈ దేశాలు సేఫ్!
World War 3

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడ చూసినా యుద్ధం తప్ప ఇంకొకటి కనిపించడం లేదు. ఒక దేశం మరో దేశం మీదకు దాడులకు తెగబడటం, ప్రతిదాడులను తిప్పికొట్టడం, మధ్యలో ఎవరైనా కలుగజేసుకుంటే వాళ్ల మీదకు యుద్ధానికి వెళ్లడం లాంటివి చూస్తున్నాం. ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య కొన్ని రోజుల పాటు అప్రకటిత యుద్ధం జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందంతో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. కానీ ఇతర దేశాల్లో మాత్రం సిచ్యువేషన్ చేయి దాటిపోతోంది. ఈ నేపథ్యంలో ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం వస్తే ఏ దేశాలు సురక్షితం? శరణార్థులు తలదాచుకునేందుకు ఏయే ప్రాంతాలకు వెళ్లొచ్చు? అనేది ఇప్పుడు చూద్దాం..


బేఫికర్..

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గినా రష్యా-ఉక్రెయిన్, ఇరాన్-ఇజ్రాయెల్, ఇజ్రాయెల్-పాలస్తీనా నడుమ భీకరంగా దాడులు జరుగుతున్నాయి. కొన్ని నెలలుగా సాగుతున్న ఈ అటాక్స్ వల్ల ఆయా దేశాల్లో భారీస్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాలు చేసుకున్నాక కూడా దాడులు ఆగడం లేదు. దీంతో ఇది కాస్తా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది. అయితే టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే వరల్డ్ వార్-3 జరిగినా ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు కొన్ని సురక్షితమైన ప్రాంతాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

war.jpg


అంటార్కిటికా

అణు యుద్ధం జరిగినా టెన్షన్ పడనక్కర్లేదు. అణ్వాయుధ దేశాలకు చాలా దూరంలో ఉందీ ఖండం. 14 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల అంటార్కిటికా.. నిరాశ్రయులకు బాసటగా ఉండేందుకు సిద్ధంగా ఉంది. అయితే మంచుతో కూడిన వాతావరణం వల్ల ఇక్కడ మనుగడ సాగించడం పెద్ద సవాల్ అనే చెప్పాలి.

ఐస్లాండ్

దునియాలోని అత్యంత శాంతియుత దేశాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది ఐస్లాండ్. ఈ దేశం పూర్తిస్థాయి యుద్ధంలో పాల్గొన్న దాఖలాలు లేవు.

న్యూజిలాండ్

గ్లోబల్ పీస్ ఇండెక్స్‌లో సెకండ్ పొజిషన్‌లో ఉంది న్యూజిలాండ్. ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం అందిస్తున్నప్పటికీ రష్యాతో ఈ దేశానికి ఎలాంటి శత్రుత్వం లేదు. ఇక్కడి పర్వత ప్రాంతాలు యుద్ధాల నుంచి రక్షణ కల్పిస్తాయని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

స్విట్జర్లాండ్

న్యూజిలాండ్‌లాగే స్విట్జర్లాండ్‌లో కూడా పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో సేఫ్‌గా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. రాజకీయంగా తటస్థంగా ఉన్నందున ఈ దేశం మీద దాడులు జరిగే అవకాశాలు కూడా తక్కువేనని అంటున్నారు.


గ్రీన్‌లాండ్

రాజకీయంగా తటస్థ వైఖరిని వ్యవహరించే గ్రీన్‌లాండ్‌లోనూ యుద్ధ భయాలు తక్కువే. ఇక్కడ జనాభా 56 వేలు మాత్రమే. కాబట్టి గొడవలు, సంఘర్షణలకు పెద్దగా ఆస్కారం లేదని నిపుణులు అంటున్నారు.

ఇండోనేషియా

ఈ దేశం కూడా తటస్థ విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోంది. ఇక్కడ గొడవలు, సంఘర్షణలూ తక్కువే. శాంతికి ప్రాధాన్యమిచ్చే ఈ దేశం నిరాశ్రయులకు బెస్ట్ ప్లేస్ అని నిపుణులు చెబుతున్నారు.

తువాలు

ఈ దేశ జనాభా 11 వేలు మాత్రమే. పరిమిత మౌలిక సదుపాయాలు ఉన్నప్పటికీ యుద్ధ భయం మాత్రం లేదు. హవాయి, ఆస్ట్రేలియా నడుమ ఉందీ కంట్రీ. దీన్ని సురక్షిత ప్రాంతంగా నిపుణులు సూచిస్తున్నారు.

భూటాన్

పర్వతాలతో నిండిన ఈ దేశం చాలా సురక్షిత ప్రదేశమని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ యుద్ధ భయం లేదని అంటున్నారు.


చిలీ

విస్తారమైన తీరప్రాంతం కలిగిన ఈ దేశం ప్రజలకు భద్రతను అందిస్తోంది. ఇక్కడ సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి.

ఫిజీ

దట్టమైన అటవీ ప్రాంతం కలిగిన ఈ దేశం.. చాలా సేఫ్ అని నిపుణులు అంటున్నారు. ప్రపంచ శాంతియుత దేశాల్లో ఒకటిగా ఫిజీకి మంచి ఇమేజ్ ఉంది.

దక్షిణాఫ్రికా

సహజ వనరులకు పెట్టింది పేరైన ఈ దేశంలో వ్యవసాయ సామర్థ్యం కూడా ఎక్కువే. అందుకే సంక్షోభ సమయంలోనూ ఇక్కడ మనుగడ సాగించొచ్చని నిపుణులు చెబుతున్నారు.


ఇవీ చదవండి:

ఒప్పందాన్ని ఉల్లంఘించొద్దు

కాల్పుల విరమణ అమల్లోకి

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 24 , 2025 | 06:22 PM