Tsunami Threat: మోగిన సునామీ సైరన్.. ఖాళీ అవుతున్న నగరాలు.. రోడ్లపై భారీ ట్రాఫిక్ జాం..
ABN , Publish Date - Jul 30 , 2025 | 02:15 PM
రష్యాలో ఉదయం సంభవించిన భూకంపం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను బెంబేలెత్తిస్తోంది. జపాన్, అమెరికా సహా పలు తీరప్రాంతాలకు ఇప్పటికే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో ప్రజలు నగరాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోవడంతో భారీ ట్రాఫిక్ జాం నెలకొంది.

రష్యాలోని బుధవారం 8.8 తీవ్రతతో భారీ భూకంపం(Earthquake In Russia) సంభవించింది. కమ్చట్కా ద్వీపకల్పం తూర్పు తీరంలోని సముద్రగర్భంలో సంభవించిన భూకంపం ప్రభావంతో సమీప ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. ఉత్తర కురిల్ దీవుల నుంచి హవాయి ద్వీపసమూహం వరకూ.. అలాగే యునైటెడ్ స్టేట్స్ పశ్చిమ తీరం వరకు సునామీ సైరన్ మోగింది. పసిఫిక్ సముద్ర తీరం వెంబడి అంతటా అధికారులు హై అలర్ట్‌లో జారీ చేశారు. హవాయిపై 10 అడుగుల ఎత్తులో రాకాసి అలలు విరుచుకుపడే అవకాశం ఉండటంతో ప్రజలు నగరాలను ఖాళీ చేస్తున్నారు. రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోవడంతో భారీ ట్రాఫిక్ జాం నెలకొంది. రష్యాతో పాటు జపాన్, అమెరికా సహా ప్రపంచంలోని పలు దేశాలకు సునామీ హెచ్చరికలు (Tsunami Threat) జారీ అయ్యాయి.
మొదటి అలలు ఇప్పటికే ఉత్తరాన అలాస్కాను తాకాయి. పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం (PTWC) సునామీ అలలు ఇప్పటికే తీరప్రాంతాలను తాకడం ప్రారంభించాయని ధృవీకరించింది. ప్రస్తుతం హవాయిలో నమోదైన ఎత్తైన అల ఓహు ఉత్తర తీరంలోని హలైవాలో 4 అడుగుల (1.2 మీటర్లు) ఎత్తుకు చేరుకుంది. అలలు దాదాపు 12 నిమిషాల పాటు వచ్చాయి.
రష్యాలోని అతి తక్కువ జనాభా కలిగిన పెట్రోపావ్లోవ్స్క్- కమ్చట్కా సమీపంలో బుధవారం తెల్లవారుజామున 8.8 తీవ్రతతో తీవ్ర భూకంపం (Russia Earthquake) సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నమోదైన పది అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఇది ఒకటి.
ఇవి కూడా చదవండి
ప్రముఖ పాప్ సింగర్ పెర్రీతో కెనడా మాజీ ప్రధాని ట్రూడో డేటింగ్ నిజమేనా
రష్యాలో భారీ భూకంపం.. జపాన్, అమెరికాలో సునామీ అలర్ట్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి