Home » Japan
16 నెలల్లో తెలంగాణ ప్రభుత్వం రూ.2,44,962 కోట్ల పెట్టుబడులను సాధించింది. జపాన్ పర్యటనలో రూ.12,600 కోట్ల పెట్టుబడులకు సీఎం రేవంత్ ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటన ఫలవంతంగా ముగిసింది. రూ.12,062 కోట్ల పెట్టుబడులు, 30,500 ఉద్యోగాలు సాధించడమేకాకుండా పలు కీలక ఒప్పందాలు కుదిరాయి
హైదరాబాద్‌కు రండి.. మీ ఉత్పత్తులు తయారుచేయండి.. భారత మార్కెట్‌తోపాటు ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేసుకోండి.. తెలంగాణను మీ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోండి.. అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి జపాన్ కంపెనీలను సాదరంగా ఆహ్వానించారు.
హైదరాబాద్‌లో ఎకో టౌన్ అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలమనే విశ్వాసాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తం చేశారు.
Baba Vanga Prophecy: బాబా వంగ చెప్పిన కాలజ్ణాన విషయాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఆమె చెప్పినవి చెప్పినట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రముఖుల మరణాల దగ్గర నుంచి కరోనా వైరస్ వరకు ఆమె చెప్పినవన్నీ జరిగాయి.. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.
తెలంగాణ యువతకు జపాన్‌లోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. 500 ఉద్యోగాలు హెల్త్‌కేర్, ఇంజినీరింగ్, హాస్పిటాలిటీ, నిర్మాణ రంగాలలో అందుబాటులో ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు
హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి ఎన్టీటీ డేటా, నెయిసా సంయుక్తంగా రూ.10,500 కోట్లు, విద్యుత్తు సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (టీటీడీఐ) రూ.562 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.
CM Revanth Tour: సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు జపాన్ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది. అందులోభాగంగా శుక్రవారం రెండు సంస్థలు.. తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకొన్నాయి. ఆ క్రమంలో రుద్రారంలో తోషిబా కంపెనీ.. తన పరిశ్రమను ఏర్పాటు చేయనుంది.
జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం తొలిరోజైన గురువారం కీలకమైన పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టోక్యోలో మారుబెనీ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రె డ్డిని కలుసుకున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి బృందం గురువారం జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ (జైకా) ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం కానుంది. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా మెట్రో రెండో దశ ప్రాజెక్ట్ నిర్మాణంలో అతి పెద్ద భాగస్వామ్యమైన ప్రపంచ బ్యాంకులు సాయం అందించాలని కోరనున్నారు.