Bear Attack On Woman: అదృష్టం బాగుంది.. లేదంటే ప్రాణాలు పోయేవి..
ABN , Publish Date - Oct 11 , 2025 | 06:44 AM
ఓ ఎలుగుబంటి 82 ఏళ్ల ఓ వృద్ధురాలిపై దాడి చేసింది. అదృష్టం బాగుండి ఆ ఎలుగుబంటి దాడి నుంచి ఆమె చిన్న గాయాలతో తప్పించుకుంది. ఈ సంఘటన జపాన్ దేశంలో ఆలస్యంగా వెలుగు చూసింది.
ఎలుగు బంటి మన మీద సడెన్‌గా దాడి చేస్తే ఏం అవుతుంది?.. భయంతో సగం ప్రాణం పోతుంది. దాని దాడి దెబ్బకు మిగిలిన ప్రాణం కూడా పోతుంది. అదృష్టం బాగుంటే.. మనకు భూమ్మీద నూకలు ఉంటే ప్రాణాలు మిగలొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలో ఓ ఎలుగుబంటి 82 ఏళ్ల ఓ వృద్ధురాలిపై దాడి చేసింది. అదృష్టం బాగుండి ఆ ఎలుగుబంటి దాడి నుంచి ఆమె చిన్న గాయాలతో తప్పించుకుంది. ఈ సంఘటన జపాన్ దేశంలో ఆలస్యంగా వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. బుధవారం డాయిసెన్‌కు చెందిన 82 ఏళ్ల వృద్ధురాలు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. ఎక్కడినుంచి వచ్చిందో కానీ, ఓ ఎలుగుబంటి సడెన్‌గా రోడ్డు మీదకు వచ్చింది. వృద్ధురాలి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి దాడి చేయటం మొదలెట్టింది. అయితే, ఆ వృద్ధురాలు ప్రాణం భయంతో గజగజలాడింది. 82 ఏళ్ల వయసులోనూ ఎంతో చురుగ్గా దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది.
ఎలుగుబంటి రెండు సార్లు దాడికి ప్రయత్నించింది. ఈ రెండు సార్లు ఆమె ఎంతో వేగంగా స్పందించి దాన్నుంచి తప్పించుకుంది. ఆ ఎలుగుబంటి ఏమీ చేయలేక అక్కడినుంచి పారిపోయింది. ఆ వృద్ధురాలు ముఖంపై చిన్న చిన్న గాయాలతో తప్పించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ‘ఆమె అదృష్టం బాగుంది. లేదంటే ప్రాణాలు పోయేవి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి