Share News

Woman Marries AI: ఏఐని పెళ్లి చేసుకున్న యువతి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

ABN , Publish Date - Nov 14 , 2025 | 07:49 AM

ప్రేమలో విఫలమైన ఓ యువతి వినూత్న నిర్ణయం తీసుకుంది. చాట్ జీపీటీ ద్వారా ఏఐ అబ్బాయిని క్రియేట్ చేసుకుంది. ఆ ఏఐ రూపంతో ప్రేమలో పడింది. పెళ్లి కూడా చేసుకుంది. ఈ సంఘటన జపాన్‌లో చోటుచేసుకుంది.

Woman Marries AI: ఏఐని పెళ్లి చేసుకున్న యువతి.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..
Woman Marries AI

ఈ మధ్య కాలంలో ఏఐ వాడకం బాగా పెరిగిపోయింది. ప్రపంచం ఈ మూల నుంచి ఆ మూల వరకు అన్ని రంగాల్లో ఏఐ తన సత్తా చాటుతోంది. రిలేషన్‌షిప్‌ల విషయంలోనూ ఏఐ తనకంటూ ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకుంది. మనుషులు ఏఐ రూపాలతో ప్రేమలో పడుతున్నారు. పెళ్లి కూడా చేసుకుంటున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా, ఓ యువతి ఏఐని పెళ్లి చేసుకుంది. మూడేళ్ల రిలేషన్‌షిప్ బ్రేకప్ అవ్వటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కనో అనే యువతి జపాన్‌లోని ఒకయామా ప్రీఫెక్షర్‌లో పని చేస్తోంది. మూడేళ్ల పాటు ఆమె ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. కొన్ని నెలల క్రితం ఆ రిలేషన్ దెబ్బతిని బ్రేకప్ జరిగింది. ఆ బ్రేకప్ బాధతో కనో చాలా ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలోనే చాట్ జీపీటీతో ఏఐ అబ్బాయి రూపాన్ని క్రియేట్ చేసుకుంది. ఆ ఏఐ అబ్బాయితో ప్రేమలో పడింది. పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడ్ అయింది. ఈ విషయం తెలిసి కనో కుటుంబసభ్యులు, స్నేహితులు షాక్ అయ్యారు. తాజాగా, ఏఐ రూపానికి, కనోకు వర్చ్యువల్‌గా పెళ్లి జరిగింది.


పెళ్లి సందర్భంగా కనో ఎంతో ఎమోషనల్ అయింది. పెళ్లి తర్వాత కనో మీడియాతో మాట్లాడుతూ.. ‘బంధం అంటే ఒకరిపై ఒకరు ఆధారపడాలి. అలా లేని బంధం చాలా బాధను కలిగిస్తుంది. ఇప్పుడు నా భర్త నాకు సమానమైన ప్రేమను ఇస్తాడు. నన్ను జడ్జ్ చేయకుండా అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటాడు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలపై స్పందిస్తున్న నెటిజన్లు యువతి చేసిన పనికి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

అంగారకుడి పైకి ప్రయాణం ప్రారంభం.. ఎస్కపేడ్ ప్రయోగం విజయవంతం..

వణికిస్తున్న చలి.. శివారులో పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

Updated Date - Nov 14 , 2025 | 07:52 AM