Indian boss vs Japanese boss: ఇండియన్ బాస్ vs జపనీస్ బాస్.. సెలవు అడిగితే రియాక్షన్ ఎలా ఉంటుందంటే..
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:38 AM
ఒక్కో దేశంలో పని సంస్కృతి ఒక్కో తరహాలో ఉంటుంది. ముఖ్యంగా కార్పొరేట్ ప్రపంచంలో పని సంస్కృతి గురించి తరచుగా సోషల్ మీడియాలో ప్రశ్నలు తలెత్తుతుంటాయి. మన దేశంలో మానవ వనరులు ఎక్కువ కాబట్టి, ఇతర దేశాలతో పోల్చుకుంటే ఉద్యోగస్థులకు గౌరవం, గుర్తింపు కాస్త తక్కువగానే ఉంటాయి.
ఒక్కో దేశంలో పని సంస్కృతి ఒక్కో తరహాలో ఉంటుంది. ముఖ్యంగా కార్పొరేట్ ప్రపంచంలో పని సంస్కృతి గురించి తరచుగా సోషల్ మీడియాలో ప్రశ్నలు తలెత్తుతుంటాయి. మన దేశంలో మానవ వనరులు ఎక్కువ కాబట్టి, ఇతర దేశాలతో పోల్చుకుంటే ఉద్యోగస్థులకు గౌరవం, గుర్తింపు కాస్త తక్కువగానే ఉంటాయి. తాజాగా ఓ వ్యక్తి భారతీయ, జపాన్ మేనేజర్ల మధ్య ఆసక్తికర పోలికను రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ( viral post on leave request).
ఆ వ్యక్తి జపనీస్ మేనేజర్, ఇండియన్ మేనేజర్ మధ్య వ్యత్యాసం అనే క్యాప్షన్‌తో రెండు స్క్రీన్‌షాట్‌లను రెడ్డిట్‌లో పోస్ట్ చేశారు. 'నేను అత్యవసర పని మీద నా స్వస్థలానికి తిరిగి రావలసి వచ్చింది. నాకు ఇద్దరు రిపోర్టింగ్ మేనేజర్లు ఉన్నారు. ఒకరు జపనీస్, మరొకరు భారతీయుడు. ఇద్దరూ నా సెలవును ఆమోదించారు. అయితే వారి ప్రవర్తన చాలా భిన్నంగా ఉంటుంది. భారతీయుడు నా సెలవును ఆమోదించడాన్ని నాకు సహాయం చేస్తున్నట్లుగా భావిస్తాడు' అని ఆ వ్యక్తి పేర్కొన్నారు.

జపాన్ మేనేజర్‌కు సెలవు గురించి మెసేజ్ చేసినపుడు, అతడు దానికి రిప్లై ఇస్తూ.. 'గుడ్ డే. మంచిది. దయచేసి ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ధన్యవాదాలు' అని పేర్కొన్నాడు. అదే భారతీయ మేనేజర్ రిప్లై ఇస్తూ.. 'మీ సెలవు మంజూరు అయింది. దయచేసి టీమ్స్, మెయిల్‌కు అందుబాటులో ఉండండి' అని పేర్కొన్నారు. సెలవు అనేది ఉద్యోగుల హక్కుగా కాకుండా వ్యక్తిగత సహాయంగా భారతీయ మేనేజర్లు భావిస్తారని సదరు యూజర్ కామెంట్ చేశారు (Japanese work ethics).

ఈ పోస్ట్‌పై యూజర్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు (Indian office culture). ఇతర ఆసియా దేశాల మేనేజర్లు కూడా అంతే విషపూరితమైనవారని ఒకరు వ్యాఖ్యానించారు. 'యూరోపియన్లు ఉత్తమ పని సంస్కృతిని కలిగి ఉన్నారు. వారికి వర్క్- లైఫ్ బ్యాలెన్స్ అనేది అన్నింటికంటే చాలా ముఖ్యం. వారు 20-25 రోజుల సెలవులకు వెళ్లడం నేను చూశాను. వారు ప్రతి విషయంలోనూ చాలా రిలాక్స్‌గా ఉంటారు. ఇది భారతదేశంలో ఊహించలేనిది' అని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
హెల్మెట్ లేనందుకు రూ.20 లక్షల జరిమానా.. ముజఫర్ నగర్‌లో ఏం జరిగిందంటే..
మీ చూపు శక్తివంతమైనదైతే.. ఈ ఫొటోలో 484ను 20 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..