Share News

Tsunami Effect: సునామీ దెబ్బకు తీరానికి భారీ తిమింగలాలు.. జపాన్‌ అణుశక్తి కేంద్రం ఖాళీ..

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:40 PM

రష్యాలో సంభవించిన భారీ భూకంపం జపాన్ సహా పసిఫిక్ మహాసముద్రం వెంబడి ఉన్న అనేక తీర దేశాలను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే అమెరికా, జపాన్ వాతావరణ సంస్థలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి.

Tsunami Effect: సునామీ దెబ్బకు తీరానికి భారీ తిమింగలాలు.. జపాన్‌ అణుశక్తి కేంద్రం ఖాళీ..

టోక్యో: రష్యా(Russia) తూర్పు తీరంలో బుధవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం పసిఫిక్ మహాసముద్రంలో కలకలం రేపింది. భూకంపం ఎఫెక్ట్ సమీప దేశాలనూ తాకింది. జపాన్ (Japan) సహా పలు తీర ప్రాంతాల్లో సునామీ (tsunami ) అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. సముద్రంలో సుమారు 3 మీటర్ల ఎత్తున అలలు విధ్యంసం సృష్టించడంతో తీరాలను భారీగా నీరు ముంచెత్తింది. లోతట్టు జలాల్లో జీవించే భారీ తిమింగలాలు సైతం తీరానికి కొట్టుకొచ్చాయి. జపాన్‌లోని చింబా తీరంలో కనిపించిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


జపాన్‌లో సునామీకి సంబంధించిన చిత్రాలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో ఈరోజు 8.8 తీవ్రతతో తీవ్ర భూకంపం (Russia Earthquake) సంభవించింది. ఆ తర్వాత జపాన్, అమెరికా, గ్వామ్ వంటి పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. పసిఫిక్‌ సముద్రంలో పుట్టుకొచ్చిన సునామీ జపాన్‌(Tsunami Warning in Japan)ను తీరప్రాంతాలను వణికిస్తోంది. రేడియేషన్ లీకేజీ సమస్య తలెత్తడంతో ఫుకుషిమా డయీచీ అణు కర్మాగారాన్ని ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే సిబ్బందిని తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే, 2011 సునామీ సమయంలో ఫుకిషిమా న్యూక్లియర్ ప్లాంట్ భారీగా దెబ్బతింది. సుమారు19 వేల మంది మరణించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి మళ్లీ వస్తుందేమో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


సీ పోర్టులు, ఎయిర్ పోర్టులు మూసివేత..

జపాన్ పసిఫిక్ తీరంలోని పలు ప్రాంతాల్లో సునామీ ప్రభావం గణనీయంగా కనిపిస్తోంది. టొకచాయ్‌ పోర్టులో 40 సెంటీమీటర్లు, ఇషినోమాకి పోర్టులో 50 సెంటీమీటర్ల ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. ఎరిమో పట్టణంలో 30 సెంటీమీటర్ల మేర అలలు రాగా.. థోకు, హన్సంకి, కాంటో ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున అలల ప్రభావం కనిపించింది. అలాగే, పశ్చిమ జపాన్‌లోని సెండాయ్ విమానాశ్రయం తాత్కాలికంగా మూసేశారు. పలు విమానాలను దారి మళ్లించారు. ప్రధానంగా, తీర ప్రాంతాలకు సమీపంలో ఉన్న విమానాశ్రయాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి

రష్యాలో భూకంపం వచ్చిన తర్వాత ముంచెత్తిన సునామీ.. డ్రోన్ వీడియో

ప్రముఖ పాప్ సింగర్ పెర్రీతో కెనడా మాజీ ప్రధాని ట్రూడో డేటింగ్ నిజమేనా

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 30 , 2025 | 01:21 PM