YouTube Ban: ఆస్ట్రేలియాలో పిల్లలకు యూట్యూబ్ నిషేధం
ABN , Publish Date - Jul 30 , 2025 | 07:11 AM
టినేజర్ల మెంటల్ హెల్త్‌పై సోషియల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో యూట్యూబ్‌ను నిషేధించింది. ఇది ఎప్పటినుంచి అమల్లోకి వస్తుందనే విషయాలను ఇక్కడ చూద్దాం.

ఆస్ట్రేలియా ప్రభుత్వం టీనేజర్ల సోషల్ మీడియా వినియోగాన్ని కట్టడి చేసేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో యూట్యూబ్‌ను నిషేధించారు (Australia Bans YouTube). ఆస్ట్రేలియా ఇంటర్నెట్ వాచ్‌డాగ్ నివేదికల ప్రకారం 10 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లలలో 37% మంది యూట్యూబ్‌లో హానికరమైన కంటెంట్‌ను చూశారని తేలింది. ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో అత్యధిక కావడం విశేషం. ఈ కారణంగా యూట్యూబ్‌ను కూడా నిషేధ జాబితాలో చేర్చారు. దీంతో ప్రపంచంలోనే మొదటిసారి యూట్యూబ్ నిషేధించిన జాబితాలో ఈ దేశం చేరింది.
ఎప్పటి నుంచి అమలు..
ఆల్బనీజ్ ప్రభుత్వం పిల్లలను సోషల్ మీడియా వల్ల కలిగే ప్రభావం నుంచి కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 2025లో అమలులోకి వచ్చే ఈ కొత్త నిబంధనల ప్రకారం, 16 ఏళ్లలోపు పిల్లలు ఇకపై YouTube, Facebook, Instagram, Snapchat, TikTok, X (Twitter) లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో అకౌంట్లను ప్రారంభించలేరు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కంపెనీలపై $49.5 మిలియన్ (సుమారు రూ. 400 కోట్లు) వరకు జరిమానా విధించనున్నారు.
యూట్యూబ్ వాదన ఏంటి?
యూట్యూబ్ ప్రతినిధి దీనిపై స్పందిస్తూ పిల్లలకు ఆన్‌లైన్ హానిని తగ్గించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తామని తెలిపారు. యూట్యూబ్ ఒక వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్, సోషల్ మీడియా కాదన్నారు. ఇది టీవీ స్క్రీన్‌లపై ఎక్కువగా వీక్షించబడే ఉచిత, కంటెంట్ లైబ్రరీ అని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలను కొనసాగిస్తామని వెల్లడించారు.
మినహాయింపు పొందిన ప్లాట్‌ఫారమ్‌లు
అక్కడి కమిషనర్ జూలీ ఇన్‌మాన్ గ్రాంట్ తెలిపిన వివరాల ప్రకారం 2,600 మంది పిల్లలపై చేసిన సర్వేలో దాదాపు 40% మంది YouTubeలో హానికరమైన కంటెంట్‌ను చూశారని తేలింది. కానీ ఈ చట్టం ప్రకారం ఆన్‌లైన్ గేమింగ్, మెసేజింగ్ యాప్‌లు, ఆరోగ్యం, విద్యా సైట్‌లు ఈ నిషేధం నుంచి మినహాయింపు పొందాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లు టీనేజర్లకు తక్కువ హాని కలిగిస్తాయని లేదా వేరే చట్టాల ద్వారా నియంత్రించబడతాయని కమ్యూనికేషన్స్ మంత్రి అనికా వెల్స్ తెలిపారు. ఇవి నిరంతరం మద్దతు ఇచ్చే విధంగా రూపొందించబడ్డాయని ఆమె అన్నారు.
ఇతర సోషల్ మీడియా కంపెనీల వాదన
మెటా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్ వంటి ఇతర సోషల్ మీడియా కంపెనీలు యూట్యూబ్‌కు మినహాయింపు ఇవ్వడం అన్యాయమని వాదించాయి. ఈ కంపెనీలు ఈ చట్టం కింద నియంత్రణకు లోనవుతాయి.
ఇవి కూడా చదవండి
ఆసియా కప్ 2025లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌పై ఏసీసీ క్లారిటీ..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి