AP Liquor Scam: లిక్కర్ కుంభకోణంలో సంచలనం.. విచారణలో సిట్ దూకుడు
ABN , Publish Date - Jul 30 , 2025 | 07:28 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో సిట్ అధికారులు సోదాలు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణంలో A 40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో (Andhra Pradesh Liquor Scam) కీలక మలుపు చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో సిట్ అధికారులు సోదాలు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కాంలో A 40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ రోజు (బుధవారం జులై 30) తెల్లవారుజామున హైదరాబాద్‌లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ కేసులో A1గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వరుణ్, A12 చాణక్య రూ. 11 కోట్లని 12 అట్టపెట్టల్లో దాచినట్లు అంగీకరించారు. 2024 జూన్‌లో ఈ మొత్తం దాచినట్లుగా అధికారులు గుర్తించారు. శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫార్మ్ హౌస్‌లో సిట్ అధికారులు తనిఖీలు చేసి భారీగా అక్రమ మద్యం డంపును స్వాధీనం చేసుకున్నారు. ఈ గెస్ట్‌హౌస్ సులోచన ఫార్మ్స్, ప్రొఫెసర్ తగల బాల్‌రెడ్డి, పేరు మీద ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. లిక్కర్ స్కాంలో సిట్ అధికారులు దూకుడు పెంచి హైదరాబాద్ నగరంలో భారీగా సోదాలు నిర్వహిస్తున్నారు. నగదు సీజ్ చేసి వరుణ్, చాణక్యలని అదుపులోకి తీసుకుని సిట్ అధికారులు విచారణ చేపడుతున్నారు. ఈ విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్
Read latest AndhraPradesh News And Telugu News