Home » Russia
అమెరికా-ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మొజ్తాబా ఖమేనీని ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారు. ఇరాన్ కొత్త సర్వోన్నత నాయకుడిగా నియమితులై దాదాపు నెల రోజులు గడిచినా, మొజ్తాబా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు.
రష్యాకు చెందిన సైనిక రవాణా విమానం ఏఎన్-26 ప్రమాదానికి గురైంది. క్రిమియాలో కొండను ఢీకొట్టి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది.
ప్రపంచ ఇంధన మార్కెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా ప్రభుత్వం ఏప్రిల్ 1, 2026 నుంచి పెట్రోల్ (Gasoline) ఎగుమతులపై పూర్తిస్థాయి నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురుకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా పెరిగింది. దేశంలో ఇంధన సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక విషయాన్ని వెల్లడించారు. పశ్చిమాసియాలో అస్థిరతను సృష్టించడానికి రష్యా తన నిఘా వ్యవస్థలను ఉపయోగించి ఇరాన్‌కు సహాయం చేస్తోందని, దీనికి సంబంధించి తమ వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు.
ఇరాన్‌కు నిఘా సమాచారం అందజేతను నిలిపివేస్తామని అమెరికాకు రష్యా ప్రతిపాదించినట్టు వచ్చిన వార్తలను అధ్యక్షుడు పుతిన్ కార్యాలయం ఖండించింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తాము చేయలేదని స్పష్టం చేసింది.
చైనాకు వెళ్లాల్సిన రష్యా చమురు ట్యాంకర్ అక్వా టైటాన్ దిశ మార్చుకుని భారత్ వైపు వెళ్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దక్షిణ చైనా సముద్ర జలాల్లో అది దిశ మార్చుకుందని సమాచారం.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్‌కు తాత్కాలిక మినహాయింపునిస్తూ అమెరికా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దంటూ కొన్ని నెలల పాటు భారత్‌తో వాణిజ్య యుద్ధానికి దిగిన అమెరికా.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ యూటర్న్ తీసుకుంది.
మొన్నటి వరకు సాధారణ వార్ డ్రోన్స్, మిస్సైల్స్ వాడిన ఇరాన్ ఇప్పుడు డోస్ పెంచింది. ఏకంగా బాలిస్టిక్ మిస్సైల్స్ క్యారీయింగ్ క్లస్టర్ మూనిషన్స్‌ను రంగంలోకి దించింది.
ఇరాన్‌లో బుషెహర్ అణుకేంద్రానికి ముప్పు ఉందని రష్యా ప్రభుత్వ అణు సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.