RELOS: భారత్-రష్యా ఒప్పందానికి ఆమోదం
ABN , Publish Date - Dec 03 , 2025 | 08:04 AM
భారత్, రష్యా దేశాలు మధ్య ఒక కీలక ఒప్పందానికి ఆమోదం లభించింది. రష్యా పార్లమెంట్ ఈ ట్రీటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా మానవతా సహాయం, డిజాస్టర్ రిలీఫ్, జాయింట్ మిలటరీ ఎక్సర్‌సైజ్‌లు, శిక్షణ కార్యక్రమాలకు ఈ ఒప్పందం..
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 3: భారత్-రష్యా మధ్య సైనిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు రష్యా పార్లమెంటు 'రెసిప్రాకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్'ఒప్పందాన్ని ఆమోదించింది. ఫిబ్రవరి 18, 2025న రెండు దేశాల మధ్య ఈ ఒప్పందం మీద సంతకాలు జరిగాయి. సైన్యం, యుద్ధనౌకలు, విమానాల మధ్య లాజిస్టిక్ సపోర్ట్‌ను ఈ ఒప్పందం సులభతరం చేస్తుంది.
ఇది యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్ వంటి దేశాలతో భారత్ ఇప్పటికే కలిగి ఉన్న ఒప్పందాల లాంటిదే.ఈ ఒప్పందం ప్రకారం, రెండు దేశాల సైనిక దళాలు ఉపయోగించుకునే విమానాలు, ఓడలు, రక్షణ దళాలు మొదలైనవి మ్యూచువల్ లాజిస్టిక్ సపోర్ట్‌తో పనిచేస్తాయి. ఉహించని విపత్తులు, మానవతా సహాయం, డిజాస్టర్ రిలీఫ్, జాయింట్ ఎక్సర్‌సైజ్‌లు, శిక్షణ కార్యక్రమాలకు ఈ ఒప్పందం మద్దతునిస్తుంది.
అంతేకాకుండా, రెండు దేశాలు ఒకరి వాయు మార్గాల్ని మరొకరు, ఓడరేవులను ఉపయోగించుకోవచ్చు. ఈ ఒప్పందం రష్యా, భారత్ మధ్య సైనిక సహకారాన్ని బలపరుస్తుందని, మ్యూచువల్ లాజిస్టిక్‌ను సులభతరం చేస్తుందని రష్యా క్యాబినెట్ మంత్రులు తెలిపారు. ఈ ఆమోదం రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత పర్యటనకు వస్తున్న తరుణంలో జరిగింది.
భారత్-రష్యా మధ్య దశాబ్దాలుగా ఎంతో పటిష్టంగా ఉన్న సైనిక సంబంధాలు ఈ ఒప్పందంతో మరింత బలపడతాయి. ఇది రెండు దేశాల సైనిక కార్యకలాపాల్లో సహకారాన్ని పెంచుతూ, భవిష్యత్ జాయింట్ ఆపరేషన్లకు మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టుబట్టి.. మంజూరు చేయించి...
Read Latest Telangana News and National News