Home » INDIA Alliance
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ మీద సుంకాల బాంబు పేల్చారు. భారతదేశంపై 25 శాతం సుంకాలు ఇంకా జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 1 నుండి, అంటే శనివారం నుండి ఇది అమల్లోకి వస్తుందని చెప్పారు.
జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కాంగ్రెస్ పట్టుబట్టనుంది. మహిళలపై పెరుగుతున్న నేరాలు, అహ్మదాబాద్ విమానం ప్రమాదం, పెరుగుతున్న నిరుద్యోగం, రైతుల కష్టాలు వంటి అంశాలను కూడా పార్లమెంటులో ప్రస్తావించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఇండియా కూటమి కింద 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయని, అయితే ఆ తర్వాత జరిగిన హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలో సోలోగానే ఎన్నికల్లోకి దిగాయని సంజయ్ సింగ్ చెప్పారు.
పైనాపిల్స్ నుండి చిప్స్ వరకు. అరుదైన భూ ఖనిజాల నుంచి ఆస్ట్రేలియన్ వైన్ వరకు. చైనా ప్రతిదానినీ ఆయుధంగా మారుస్తుంది. తైవానీస్ పైనాపిల్స్‌ను నిరోధించడం, ఆస్ట్రేలియన్ వైన్‌పై సుంకాలు విధించడం, ఇంకా..
బ్రెజిల్, రియో డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ సమ్మిట్ సరికొత్త ఆలోచనలతో ముగిసింది. ఈ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో హైలెట్ ఏంటంటే, ఒకే కరెన్సీ. ఇది ప్రధానంగా ప్రపంచ ఇంటర్‌బ్యాంక్ చెల్లింపు నెట్‌వర్క్ అయిన SWIFTకి ప్రత్యామ్నాయ వ్యవస్థను సృష్టిస్తుంది.
1.4 బిలియన్ల భారతీయుల తరఫున 'ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా' అవార్డును స్వీకరిస్తున్నానని భారత ప్రధాని మోదీ చెప్పారు. ఈ గౌరవాన్ని భారతదేశ యువత ఆకాంక్షలు, సాంస్కృతిక సంప్రదాయాలు, వైవిధ్యం, ఇంకా ఘనా-భారత్ మధ్య చారిత్రక సంబంధాలకు అంకితం చేస్తున్నానని చెప్పారు.
ప్రతిపక్ష ‘ఇండీ కూటమి’ భవిష్యత్ ఏమంత ఉజ్వలంగా లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Several Airports Closure: ఆపరేషన్ సిందూర్ వల్ల పాకిస్తాన్, భారతదేశం మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విమానాల ఎయిర్‌పోర్టులను మూసివేసినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.
ఎన్డీయేను ఓడించేందుకు ఇండియా కూటమి భాగస్వాములంతా బూత్ స్థాయి నుంచి కలిసికట్టుగా పనిచేయనున్నట్టు మనోజ్ ఝా చెప్పారు. తామంతా ఐక్యంగా ఉన్నామని, ప్రతి సీటుకూ గట్టిపోటీ ఇస్తామని, ఎన్డీయేను ఓడిస్తామని చెప్పారు.
ఇంతకాలం పాకిస్థాన్ అకృత్యాలు, నీచత్వాల గురించి గొంతు చించుకుని ప్రపంచ వేదికలమీద అరుస్తూ వచ్చింది భారత్. అయితే, ఇప్పుడు యావత్ ప్రపంచానికి పాక్ పాపాల చిట్టా అర్థమవుతోంది.