Bihar Elections: మహాకూటమి లెక్కలు తేలాయి.. 12 సీట్లలో స్నేహపూర్వక పోటీ
ABN , Publish Date - Oct 24 , 2025 | 08:18 PM
తొలుత 15 సీట్లలో మహాకూటమి అభ్యర్థులు ఒకరితో మరొకరు తలపడుతూ నామినేషన్ల వేశారు. దీంతో గందరగోళం నెలకొంది. గురవారంనాడు జరిగిన మహాకూటమి నేతల మీడియా సమావేశంలో షీట్ల షేరింగ్ వివరాలను వెల్లడిస్తారనే ఊహాగానాలు వెలువడినప్పటికీ దానిపై ఎలాంటి ప్రకటన చేయకుండానే సమావేశం ముగిసింది.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో విడత (Second Phase) పోలింగ్‌కు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో మహాకూటమి(Mahaghatbandhan) అభ్యర్థుల లెక్కలు తేలాయి. 12 నియోజకవర్గాల్లో మహాకూటమి అభ్యర్థుల మధ్య 'స్నేహపూర్వక పోటీ' ఖరారైంది.
తొలుత 15 సీట్లలో మహాకూటమి అభ్యర్థులు ఒకరితో మరొకరు తలపడుతూ నామినేషన్ల వేశారు. దీంతో గందరగోళం నెలకొంది. గురవారంనాడు జరిగిన మహాకూటమి నేతల మీడియా సమావేశంలో షీట్ల షేరింగ్ వివరాలను వెల్లడిస్తారనే ఊహాగానాలు వెలువడినప్పటికీ దానిపై ఎలాంటి ప్రకటన చేయకుండానే సమావేశం ముగిసింది. అయితే గురువారం సాయంత్రం ఇద్దరు 'ఇండియా' కూటమి అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మరో అభ్యర్థి కూడా నామినేషన్ ఉపసంహరించుకుంటారని అనుకున్నప్పటికీ వెంటనే స్పష్టత రాలేదు.
స్నేహపూర్వక పోటీ నియోజకవర్గాలివే..
మహాకూటమి నేతలు స్నేహపూర్వక పోటీకి దిగుతున్న నియోజకవర్గాల్లో కహల్గావున్ (ఆర్జేడీ-కాంగ్రెస్), గౌర బౌరం (వీఐపీ-ఆర్జేడీ), బిహార్‌షరీఫ్ (సీపీఐ-కాంగ్రెస్), రాజాపాకర్ (సీపీఐ-కాంగ్రెస్), వైశాలి (కాంగ్రెస్-ఆర్జేడీ), నర్కటియాగంజ్ (ఆర్జేడీ-కాంగ్రెస్), చైన్‌పూర్ (వీఐపీ-ఆర్జేడీ), బెల్డౌర్ (ఐఐపీ-కాంగ్రెస్), కర్గహార్ (సీపీఐ-కాంగ్రెస్), సికందరా (ఆర్జేడీ-కాంగ్రెస్), సుల్తాన్‌గంజ్ (ఆర్జేడీ-కాంగ్రెస్), బఛ్వాడా (సీపీఐ-కాంగ్రెస్) ఉన్నాయి. బిహార్‌లో రెండు విడతల పోలింగ్ నవంబర్ 6,11 తేదీల్లో జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
జమ్మూకశ్మీర్ రాజ్యసభ ఫలితాలు.. నేషనల్ కాన్ఫరెన్స్‌కు 3, బీజేపీకి 1
మళ్లీ.. రాష్ట్ర పర్యటనకు విజయ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి