Home » Putin
ప్రధాని షరీఫ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలవడానికి 40 నిమిషాలు పాటు వెయిట్ చేశారు. ఎంతకీ ఆయనకు పిలుపు రాలేదు. దీంతో ఆయనే మీటింగ్ జరుగుతున్న రూముకు వెళ్లారు. అయినా కూడా పుతిన్ షరీఫ్‌ను పట్టించుకోలేదు. పది నిమిషాల తర్వాత ఆయన కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన అత్యంత స్నేహపూర్వకంగా సాగింది. పుతిన్ రెండ్రోజుల పర్యటనను ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తికరంగా గమనించాయి. చైనా వంటి దేశాలు పుతిన్ భారత పర్యటనను ఆహ్వానించాయి. అయితే ఆమెరికాలో మాత్రం ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి.
వాషింగ్టన్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే వాస్తవరూపం దాల్చనుందని జైశంకర్ చెప్పారు. యూఎస్‌తో వాణిజ్యం అనేది చాలా ముఖ్యమైన అంశమని, సహేతుకలైన నిబంధనలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.
భారత్‌కు రష్యా నమ్మకమైన ఇంధన సరఫరాదారుగా ఇకముందు కూడా కొనసాగుతుందని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హామీ ఇచ్చారు. భారత్‌కు అంతరాయం లేకుండా చమురు, గ్యాస్, బొగ్గు వంటి అవసరమైన అన్నిరకాల ఇంధనాలను సరఫరా చేసేందుకు సిద్ధంగా.......
మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీకి అహ్వానం అందలేదని కాంగ్రెస్ వర్గాలు ధ్రువీకరించాయి. కీలక దౌత్య ప్రముఖులు హాజరయ్యే కార్యక్రమంలో తమ నేతలకు ఆహ్వానం లేకపోవడంపై ఆ వర్గాల్లో చర్చ జరుగుతోంది
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన ద్వైపాక్షిక సమావేశానంతరం ఇరువురు నేతలు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఈ-టూరిస్ట్ వీసా, గ్రూప్ టూరిస్ట్ వీసా సర్వీసులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పర్యటన భారత్‌లో రెండో రోజు కొనసాగుతోంది. ఇండియాలో పర్యటించేందుకు ఆయన నిన్న(గురువారం) సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. పుతిన్ పర్యటనకు సంబంధించి మినిట్ టు మినిట్ లైట్ అప్డేట్స్ కోసం ఇక్కడ చూడండి..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో దేశ ప్రధాని నరేంద్ర మోదీది ప్రత్యేకమైన అనుబంధం. నరేంద్ర మోదీ 2014లో దేశ ప్రధాని అయిన తర్వాతే పుతిన్‌తో పరిచయం ఏర్పడిందని చాలా మంది అనుకుంటారు. అయితే అది నిజం కాదు. అంతకు 13 ఏళ్ల ముందే మోదీ, పుతిన్ మధ్య స్నేహం మొదలైంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండ్రోజుల పర్యటన నిమిత్తం కొద్ది సేపటి క్రితం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ సమీపంలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో దిగిన పుతిన్‌కు ప్రధాని మోదీ స్వయంగా స్వాగతం పలికారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య భారీ రక్షణ, వాణిజ్య ఒప్పందాలు కుదురుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య రెండు బిలియన్ డాలర్ల విలువైన సబ్‌మెరిన్ డీల్ కుదరనుందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.