India Russia submarine deal: రష్యాతో రెండు బిలియన్ డాలర్ల డీల్ కుదిరిందా.. నిజమెంత..
ABN , Publish Date - Dec 04 , 2025 | 06:10 PM
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య భారీ రక్షణ, వాణిజ్య ఒప్పందాలు కుదురుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య రెండు బిలియన్ డాలర్ల విలువైన సబ్‌మెరిన్ డీల్ కుదరనుందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య భారీ రక్షణ, వాణిజ్య ఒప్పందాలు కుదురుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య రెండు బిలియన్ డాలర్ల విలువైన సబ్‌మెరిన్ డీల్ కుదరనుందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. అయితే ఈ వార్తలో నిజం లేదని ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది (USD 2 billion defence deal).
భారతదేశం రష్యాతో ఎటువంటి కొత్త జలాంతర్గామి ఒప్పందంపై సంతకం చేయలేదని పేర్కొంది. ఈ వాదన తప్పుదారి పట్టించే విధంగా ఉందని, కొత్త ఒప్పందం ఏదీ కుదుర్చుకోలేదని నొక్కి చెప్పింది. అయితే నివేదికలో పేర్కొన్న ఒప్పందం 2019లో కుదిరినదని, డెలివరీ ఆలస్యం అయిందని, అది 2028 నాటికి షెడ్యూల్ అయిందని తెలిపింది. ఈ జలాంతర్గామి కోసం దాదాపు పదేళ్లుగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి (India Russia defence relations).
ఆ జలాంతర్గామి ధర విషయంలో ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరలేదు (submarine deal). పుతిన్ భారత పర్యటన వేళ ఈ జలాంతర్గామి విషయంలో చర్చలు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. రాబోయే రెండేళ్లలో ఈ సబ్‌మెరిన్‌ను భారత్‌కు రష్యా అందించనుందట. ఈ నౌక 10 సంవత్సరాల లీజుపై భారత నావికాదళంలో చేరనుందని తెలుస్తోంది. భారత నావికా దళంలో ఇప్పటికే ఉన్న రెండు జలాంతర్గాముల కంటే ఇది పెద్దదని సమాచారం.
ఇవీ చదవండి:
కూలిన అమెరికా ఎఫ్-16సీ ఫైటర్ జెట్.. పైలట్ సేఫ్
తీరు మార్చుకోని పాక్.. భారత గగనతలంలోకి విమానాలను అనుమతించినా..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి