Share News

Russian oil discount India: భారత్‌కు మరింత డిస్కౌంట్‌తో రష్యన్ ఆయిల్..

ABN , Publish Date - Nov 24 , 2025 | 08:52 PM

రష్యా అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి సంస్థలైన రాస్‌నెఫ్ట్, లోకోయిల్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆంక్షలు అమల్లోకి రావడంతో క్రూడాయిల్ ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి.

Russian oil discount India: భారత్‌కు మరింత డిస్కౌంట్‌తో రష్యన్ ఆయిల్..
cheap Russian oil offer

రష్యా అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి సంస్థలైన రాస్‌నెఫ్ట్, లోకోయిల్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆంక్షలు అమల్లోకి రావడంతో క్రూడాయిల్ ధరలు రికార్డు స్థాయిలో తగ్గాయి. దీంతో భారత్ రిఫైనరీలకు రష్యా చమురు మరింత భారీ డిస్కౌంట్‌తో లభించనుంది. గత రెండేళ్లుగా రష్యా నుంచి భారత్ రిఫైనరీలు ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే (US sanctions Russia oil).


ప్రస్తుతం రష్యా ప్రధాన చమురు అయిన ఉరెల్స్ డెలివరీ ఆధారంగా బ్రెంట్ ముడి చమురు ధర కంటే బ్యారెల్‌కు ఏడు డాలర్ల తగ్గింపుతో భారత రిఫైనరీలకు అందించనున్నారు. అమెరికా ఆంక్షలు విధించడానికి ముందు బ్యారెల్‌కు మూడు డాలర్ల తగ్గింపు మాత్రమే లభించేది. ఆమెరికా ఆంక్షల కారణంగా ఆ డిస్కౌంట్ ఏడు డాలర్లకు చేరింది. ఈ కొత్త డిస్కౌంట్ డిసెంబర్‌లో లోడ్ చేసి జనవరిలో భారత్‌కు చేరే చమురుకు వర్తిస్తుంది (India Russia crude deal).


2022లో ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన తర్వాత తక్కువ ధరల కారణంగా రష్యా చమురును భారత్ భారీగా కొనుగోలు చేస్తూ వచ్చింది (US sanctions impact oil). అయితే నవంబర్ 21 నుంచి రష్యా చమురు సంస్థలైన రాస్‌‌నెస్ట్, లోకోయిల్ సంస్థలపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షల కారణంగా భారత రిఫైనరీలు రష్యా చమురు ఆర్డర్లను కొంతకాలం నిలిపివేశాయి. అయితే ఈ వారంలో ఉరెల్స్ ధర భారీగా తగ్గడంతో ఆంక్షలు లేని సంస్థల నుంచి కొనుగోలు చేసేందుకు కొన్ని రిఫైనరీలు సిద్ధపడుతున్నాయి.


ఇవీ చదవండి:

అన్‌క్లెయిమ్డ్‌ బీమా మొత్తాలు క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా

అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 24 , 2025 | 08:52 PM