Corn For Diabetics: షుగర్ ఉన్నవారికి మొక్కజొన్న మంచిదా? చెడ్డదా? నిపుణుల సూచన ఇదే..
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:29 PM
వర్షాకాలంలో వేడి వేడి మొక్కజొన్న పొత్తులు తింటే ఆ థ్రిల్లే వేరంటారు ఆహార ప్రియులు. ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉండే మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. రుచిలో కాస్తంత తియ్యగా ఉండటం వల్ల మొక్కజొన్నను తినేందుకు డయాబెటిస్ రోగుల్లో చాలామంది భయపడుతుంటారు. ఇంతకీ, ఇది షుగర్ ఉన్నవారికి మంచిదా? చెడ్డదా? నిపుణులు ఏమంటున్నారు..

వర్షాకాలంలో వేడి వేడి మొక్కపొత్తులు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. చిటపట చినుకులు కురిసే సమయంలో కాల్చిన మొక్కజొన్న కంకులు తింటే ఆ రుచే వేరంటారు ఫుడీస్. అందరికీ ఎంతగానో నచ్చే ఈ మొక్కజొన్న గింజలను సూప్, ఇతర వంటకాల్లోనూ తరచూ వేస్తుంటారు. అయితే, రుచిలో తియ్యగా ఉండటం వల్ల తినాలా? వద్దా? అనే సందేహం డయాబెటిస్ రోగుల్లో ఉండటం సహజమే. టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ అయిన మొక్కజొన్న తింట బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయా? ఎంత తినాలి? అనే ప్రశ్నలకు నిపుణుల సమాధానం ఇదే..
షుగర్ ఉంటే మొక్కజొన్న తినొచ్చా?
డయాబెటిస్ ఉన్నవారికి మొక్కజొన్న తినకూడదనే రూలేం లేదు. మితంగా, సరైన విధంగా తింటే ఇది నిజంగా షుగర్ పేషెంట్లకు అద్భుతమైన ఆహారమని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇది ఫైబర్, అవసరమైన విటమిన్ సి, బి లు, ఖనిజాలు (మెగ్నీషియం, పొటాషియం) , యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇందులోని ఫైబర్ కంటెంట్ గ్లూకోజ్ లెవల్స్ పెరగకుండా అడ్డుకుంటుంది. అయితే, సరైన పరిమాణంలో తినాలని గుర్తుంచుకోండి.
మొక్కజొన్న ఎలా తినాలి?
ప్రాసెస్ చేసిన మొక్కజొన్న ఉత్పత్తులు లేదా తీపి మొక్కజొన్న వంటకాలను ఎంచుకునే బదులు తాజా మొక్కజొన్నను చేర్చుకోవడానికి ప్రయత్నించండి. వీటిని కాల్చుకుని తినవచ్చు. ఉడకబెట్టి తినవచ్చు. సలాడ్లు, సూపులు, లేదా కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
రోజూ ఈ 5 పనులు చేస్తే.. 90% సమస్యలు సాల్వ్..
పదే పదే జుట్టు దువ్వడం వల్ల పురుషులకు బట్టతల వస్తుందా?
For More Health News