Vellore Wife Lover Murder Case: భర్తను హత్య చేయించిన మరో భార్య.. బయటపెట్టిన మూడేళ్ల కూతురు..
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:37 PM
ఆలుమగల మధ్య అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. పరాయి వ్యక్తి మోజులో పడి మరో భార్య ప్రియుడితో భర్తను కడతేర్చిన దారుణ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. మా నాన్నను అలా చేసింది ఆ అంకులే అని మూడేళ్ల చిన్నారి విషయం బయటపెట్టడంతో..

తమిళనాడు: నానాటికీ మానవసంబంధాలు తీసికట్టుగా మారుతున్నాయి. ముఖ్యంగా ఆలుమగల మధ్య అక్రమ సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. పరాయి వ్యక్తి మోజులో పడి భర్తను కడతేరుస్తున్న భార్యల సంఖ్యలు రోజుకు మూడు లేదా నాలుగైనా వెలుగు చూస్తున్నాయి. అలాంటి దారుణ ఘటనే తమిళనాడులో సంచలనం రేపుతోంది. మా నాన్నను అలా చేసింది ఆ అంకులే అని మూడేళ్ల కుమార్తె ఇచ్చిన సమాచారంతో తల్లి గుట్టు రట్టయ్యింది.
వేలూరు జిల్లా కుప్పంపాళ్యానికి చెందిన భారత్(36)కు, ఐదేళ్ల కిందట బెంగళూరుకు చెందిన నందిని(26)తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. భారత్ చెన్నైలో ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. వారానికి ఒకరోజే ఇంటికొచ్చి వెళ్తుంటాడు. భర్త దూరంగా ఉండటంతో ఎదురింట్లో ఉన్న సంజయ్(21) అనే యువకుడి పట్ల ఆకర్షితురాలైంది నందిని. ఇద్దరూ గుట్టుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుండగా.. ఒకనాడు భారత్ కు విషయం తెలిసింది. ఆ తర్వాత కూడా పలుమార్లు పద్ధతి మార్చుకోమని హెచ్చరించాడు. అయినా నందిని భర్త మాటలు తలకెక్కించుకోలేదు. ప్రేమ మత్తులో పడిన నందిని భర్తను చంపేందుకు ప్రియుడు సంజయ్ తో కలిసి కుట్ర పన్నింది.
ఈ నెల 21న భారత్ ఇంటికొచ్చి సరకుల కోసం భార్య, చిన్న కూతురును బైక్‌పై దుకాణానికి తీసుకెళ్లాడు. తిరిగొస్తున్నప్పుడు రోడ్డుపై కొబ్బరిమట్టలు ఉండటంతో వాటిని దాటే క్రమంలో కిందపడ్డ బైక్ నుంచి కింద పడ్డాడు. అదే సమయంలో పొదలో దాక్కొని ఉన్న సంజయ్ కిందపడ్డ భారత్‌ను కత్తితో పొడిచి చంపి పారిపోయాడు. పోలీసుల విచారణలో నందిని పొంతన సమాధానాలు చెప్పడంతో పోలీసులు మూడేళ్ల చిన్నారిని అడిగారు. పాప చెప్పింది విన్నాక హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నందినిని, సంజయ్‌ని అరెస్ట్ చేశారు. అలా జరిగిందంతా చెప్పి తల్లిని, ఆమె ప్రియుడిని పోలీసులకు పట్టించింది కుమార్తె.
ఇవి కూడా చదవండి
ముంబై పేలుళ్ల కేసు.. నిందితులను తిరిగి అరెస్టు చేయకూడదని చెప్పిన సుప్రీంకోర్టు
బై.. బై.. స్టాలిన్.. మిమ్మల్ని ప్రజలే ఇంటికి సాగనంపుతారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి