AC Bus Stops: చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్‌స్టాప్‌లు
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:47 PM
నగరంలో నాలుగు చోట్ల కొత్తగా ఏసీ బస్‌స్టాపులు నిర్మించనున్నట్లు సీఎండీఏ ఉన్నతాధికారులు తెలిపారు. కొళత్తూరు, రాయపురం, పెరంబూరు, వాల్‌టాక్స్‌రోడ్డు ప్రాంతంలో ఈ ఏసీ బస్‌స్టాపులను నిర్మిస్తామన్నారు.

- కొళత్తూరు, రాయపురం, పెరంబూరు, వాల్‌ట్యాక్స్ రోడ్డులో ఏర్పాటు
చెన్నై: నగరంలో నాలుగు చోట్ల కొత్తగా ఏసీ బస్‌స్టాపులు నిర్మించనున్నట్లు సీఎండీఏ ఉన్నతాధికారులు తెలిపారు. కొళత్తూరు, రాయపురం, పెరంబూరు, వాల్‌టాక్స్‌రోడ్డు ప్రాంతంలో ఈ ఏసీ బస్‌స్టాపులను నిర్మిస్తామన్నారు. సిటీ బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులకు ఎండవేడి తగలకుండా, అసౌకర్యానికి గురికాకుండా నగరంలోని కత్తిపారా జంక్షన్ సమీపం ఆలందూరు వద్ద, సెయింట్ థామస్ మౌంట్ తదితర ప్రాంతాల్లో ఏసీ బస్‌స్టాపులు ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం రూ.8 కోట్లతో ఈ నాలుగు కొత్త బస్‌స్టాప్‌లను నిర్మించనున్నామని అధికారులు పేర్కొన్నారు. కొళత్తూరు, రాయపురం, వాల్‌టాక్స్ రోడ్డు ప్రాంతాల్లో నిర్మించనున్న ఏసీ బస్‌స్టాప్‌లో ప్రయాణికులు కూర్చునేందుకు 78 సీట్లు ఏర్పాటు చేస్తామన్నారు. పెరంబూరు వద్ద నిర్మించే బస్‌స్టాప్‌లో 54 మంది ప్రయాణికులకు సీటింగ్ సదుపాయం కల్పించనున్నామని తెలిపారు. ఈ నాలుగు ఏసీ బస్‌స్టాప్‌ల నిర్మాణం పూర్తయిన తర్వాత నగరంలో మరికొన్ని ప్రాంతాల్లో ఏసీ బస్‌స్టాప్‌లను నిర్మిస్తామని అధికారులు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
2 నెలల్లో ఓఆర్‌ఆర్ ఆర్థిక ప్రతిపాదనలు
Read Latest Telangana News and National News