Home » Tamilnadu News
TVK పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్‌పై చెన్నైలోని పెరవల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్‌తో పాటు సుమారు 5 వేల మంది పార్టీ కార్యకర్తలపైనా కేసులు పెట్టారు. అనుమతికి మించి లౌడ్‌స్పీకర్లు, అంబులెన్స్‌కు ఆటంకం కల్పించారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది.
త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పలు పార్టీల తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. తాజాగా టీవీకే అధిపతి విజయ్ తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. విజయ్ రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు.
వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా భారత ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ జారీ చేసింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ప్రామాణిక వసతులు కల్పించాలని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుపై వెళుతున్న ఇతర వాహనాలను ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే నాలుగు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. రెండు విడతల్లో ఈ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ యోచిస్తున్నట్టు సమాచారం.
తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న ఉగ్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు వీరిని తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు.
దిండుగల్ జిల్లా, పుగలైపట్టిలో జల్లికట్టు పోటీల సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోటీలో పాల్గొన్న ఓ యువకుడు ఎద్దు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది.
వీధిలో లభించిన బంగారు నగలను పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్న ఓ పారిశుద్ధ్య కార్మికురాలిని సూపర్ స్టార్ రజనీకాంత్ అభినందించారు. ఆమెకు బంగారు గొలుసు బహుమతిగా ఇచ్చి సత్కరించారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇటీవల తమిళనాడు పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.