Hosur Hidden Camera Case: ప్రియుడితో జల్సాల కోసం తన హాస్టల్ బాత్ రూంలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసింది
ABN , Publish Date - Nov 09 , 2025 | 03:37 PM
నీతో కలిసి కారులో షికారు చేయాలనుందని ప్రియురాలితో చెప్పాడు. అంతేకాదు, ఇద్దరం కలిసి ఆడంబర జీవితం సాగించాలన్నాడు. అంతే, ప్రియురాలి మైండ్ లో ఒక ఆలోచన వచ్చింది. తాను ఉంటున్న హాస్టల్‌లో వేలాది మంది అమ్మాయిలు ఉన్నారని..
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు హోసూరు లోని లేడీస్ హాస్టల్‌లో రహస్య కెమెరాల కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్థానిక టాటా ఎల్రక్టానిక్స్ కంపెనీ మహిళా సిబ్బంది నివసించే హాస్టల్‌లో రహస్య కెమెరా అంశం సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. వేలాది మంది మహిళలు, యువతులు హాస్టల్ ముందు ధర్నాకు దిగడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది.
ఈ ఉదంతం వివరాల్లోకి వెళ్తే.. టాటా ఎల్రక్టానిక్స్ కంపెనీ తమ సంస్థలో పనిచేసే మహిళా కార్మికుల కోసం హోసూరులో 11 అంతస్తులతో కూడిన 8 భవనాలు నిర్మించింది. ఘటన జరిగిన హాస్టల్లో రెండు వేలకు పైగా మహిళా కార్మికులు బస చేస్తున్నారు. ఒక్కో గదిలో నలుగురు ఉంటున్నారు.
4వ బ్లాక్, 8వ అంతస్తులో ఉండే, మహారాష్ట్రకు చెందిన యువతి అనామికకు బాత్‌రూం లో రహస్య కెమెరా కనిపించింది. దీంతో కంగారుపడ్డ ఆమె... వెంటనే అదే గదిలో ఉంటున్న ఒడిశాకు చెందిన నీలా కుమారి గుప్తాకు తెలిపింది. వెంటనే నీలా బాత్‌రూం దగ్గరకు వెళ్లి కెమెరాను లాగి కిందకు పడేసింది. అయితే, నిజానికి నీలాకుమారినే ఆ కెమెరాను రహస్యంగా ఏర్పాటు చేసింది.
కెమెరా పసిగట్టిన అనామిక హాస్టల్ వార్డెన్ సరితకు విషయం చెప్పగా తాను చూసుకొంటానని, బయట ఎవరికీ చెప్పవద్దని సూచించింది. ఈ ఘటనతో ఆవేశానికి గురైన తోటి మహిళా కార్మికులు ఏకమై ఆందోళన చేపట్టారు. దీంతో జిల్లా ఎస్పీ తంగదురై, ఉద్దనపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టి అసలు విషయం బయటపెట్టారు.

నీలా.. తన ప్రియుడైన పంజాబ్‌కి చెందిన రవిప్రతాప్‌సింగ్ తో జల్సా జీవితం అనుభవించేందుకు సదరు వీడియో ఫుటేజ్ ఒక మార్గమని భావించి ఈ ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఆయా వీడియోలు అమ్మడమే కాకుండా, వీడియోల్లో ఉన్న మహిళల ఫోన్ నెంబర్లు కూడా ఇస్తానని ఆయా యువతుల్ని బెదిరించి డబ్బు సంపాదించవచ్చని కూడా ప్రియుడితో చెప్పి, నీలా ఈ పనికి ఉపక్రమించింది. దీంతో జిల్లా పోలీసులు ఢిల్లీ నిజాముద్దీన్ రైల్వేస్టేషన్ సమీపంలో నీలా ప్రియుడి మొబైల్ ఫోన్ సిగ్నల్‌ను గుర్తించి అరెస్ట్ చేసి ఉద్దనపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి..
గుజరాత్‌లో ముగ్గురు ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్
పిల్లలకు వారు తుపాకులిస్తే.. మేం ల్యాప్‌టాప్ ఇస్తున్నాం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి