BSF Recruitment 2025: బీఎస్ఎఫ్ బంపర్ ఆఫర్..3,588 కానిస్టేబుల్ ట్రేడ్ మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్..
ABN , Publish Date - Jul 24 , 2025 | 02:58 PM
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్) 3,588 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 26 నుండి ఆగస్టు 24, 2025 మధ్య ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

సైనికుడిగా దేశసేవలో పాలుపంచుకోవాలని ఉవ్విళ్లూరే యువతకు శుభవార్త. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) 3,588 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తుదారులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ITI కలిగి ఉండాలి. నోటిఫికేషన్ ప్రకారం, జులై 26 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. నిర్ణయించిన తేదీల్లోగా అధికారిక వెబ్‌సైట్ rectt.bsf.gov.in ని సందర్శించి అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. చివరి తేదీ ఆగస్టు 25.
నియామక వివరాలు
ఈ నియామకం కింద BSF మొత్తం 3588 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో 3406 కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్) పోస్టులు పురుషులకు, 182 కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్) పోస్టులు మహిళలకు రిజర్వ్ చేశారు.
అర్హతలు
BSF కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి కనీస వయస్సు18. గరిష్ఠ వయసు 25 సంవత్సరాలు. OBC కేటగిరీకి 3 సంవత్సరాలు, SC, ST కేటగిరీ దరఖాస్తుదారులకు 5 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అయితే, అభ్యర్థి నిర్దేశించిన శారీరక అర్హత ప్రమాణాలను కలిగి ఉండటం తప్పనిసరి.
జీతం
ఎంపికైన అభ్యర్థులకు పే మ్యాట్రిక్స్ లెవల్-3 ప్రకారం నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం లభిస్తుంది. దీంతో పాటు, ప్రభుత్వం సూచించిన ఇతర అలవెన్సులు, సౌకర్యాలు విడిగా అందుతాయి.
దరఖాస్తు ప్రక్రియ, రుసుములు
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు ముందుగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) చేయాలి. రిజిస్ట్రేషన్ ద్వారా రిక్రూట్‌మెంట్ కోసం ఫారంను పూరించాలి. ఆ తరువాత లాగిన్ అవ్వాలి. చివరగా నిర్దేశించిన రుసుము చెల్లించి అప్లికేషన్ ఫారం సబ్మిట్ చేయాలి.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ వర్గాలకు దరఖాస్తు రుసుము రూ.100గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన అభ్యర్థులు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
BSF అధికారిక వెబ్‌సైట్ bsf.gov.in ని సందర్శించండి .
హోమ్‌పేజీలో లాగిన్‌పై క్లిక్ చేయండి.
వివరాలను నమోదు చేసి ప్రొఫైల్ క్రియేట్ చేయండి.
ఇప్పుడు దరఖాస్తు ఫారమ్ నింపి డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయండి.
చివరగా రుసుము చెల్లించి సబ్మిట్ చేయండి.
ఇవి కూడా చదవండి
అలర్ట్.. పరీక్షల విషయంలో కొత్త రూల్స్ జారీ..
ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులకు శుభవార్త!
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి