CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్‌రెడ్డి నయా ప్లాన్
ABN , Publish Date - Nov 02 , 2025 | 03:58 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నయా ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఆదివారం సమావేశం అయ్యారు.
హైదరాబాద్, నవంబరు2 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నయా ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంత్రులు, కాంగ్రెస్ (Congress) పార్టీ ముఖ్య నేతలతో ఇవాళ(ఆదివారం) సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills Bye Election)పై ప్రత్యేక ప్రణాళికని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం చర్చించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అజారుద్దీన్, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
మంత్రులు, పార్టీ నేతలతో లంచ్ మీటింగ్‌లో పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రేపటి నుంచి కొత్త కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని సీఎం సూచించారు. పోలింగ్ బూత్ లెవెల్‌లో ఓటరును నేరుగా కలిసే కార్యక్రమాన్ని రూపొందించాలని మంత్రులని ఆదేశించారు. పోలింగ్ బూత్ లెవెల్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో నియోజకవర్గ ఇబ్బందులను వీడియోలుగా చేయించాలని నిర్దేశించారు. బూత్ స్థాయిలో కీలకమైన వ్యక్తుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రచార వేగాన్ని మరింతగా పెంచాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. సర్వేలు తమకి అనుకూలంగా ఉన్నాయని వివరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మెజారిటీ పెంచే అంశంపై మంత్రులు దృష్టి పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి మార్గనిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రయాణికులకు అలర్ట్.. మెట్రో టైమింగ్స్ సవరణ
షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం
Read Latest Telangana News And Telugu News