Home » Telangana Chief Minister
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలంటూ బీఆర్ఎస్వీ విద్యార్థులు, వడ్డెర సంఘాల నేతలు తెలంగాణ అసెంబ్లీ దగ్గర మంగళవారం ధర్నా చేపట్టారు. వివిధ సంఘాల ముట్టడితో అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు, నిర్భంధాలతో ప్రజాగ్రహాన్ని అణిచివేయలేరని చెప్పుకొచ్చారు.
విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కను అభినందించారు.
తెలంగాణ రూపురేఖలు మార్చేందుకే క్యూర్, ప్యూర్, రేర్ మోడల్ తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాలుష్యకారక పరిశ్రమలను ORR బయటకు తరలిస్తామని తెలిపారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డిని సీఎం చేసింది తానేనని, సినిమాల్లో సీఎం పాత్ర చేయాలని ఉందని మల్లారెడ్డి పేర్కొన్నారు.
రైతు భరోసా నిధులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. తొలివిడత 70 లక్షల మంది ఖాతాలకు రైతు భరోసా నిధులు రిలీజ్ చేశారు.
రైతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా కల్పించారు. అన్నదాత సంతోషం కోసం ఓ అన్నగా తాను బాధ్యత తీసుకున్నానని పేర్కొన్నారు.
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోసం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి చైర్మన్‌ను కలుస్తామని తెలిపారు.
తెలంగాణలో పదవ తరగతి బోర్డు పరీక్షలు రద్దు కాబోతున్నాయంటూ వస్తున్న వార్తలపై రాష్ట్ర విద్యా కమిషన్ కీలక ప్రకటన చేసింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కమిషన్ స్పష్టం చేసింది. ఈ విషయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపింది.
పదో తరగతి పరీక్షలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పదో తరగతి పరీక్షలు లేనట్లేనన్నారు. దేశమంతా +2 విధానం అమల్లో ఉందని ప్రస్తావించారు. తమది వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ బడ్జెట్ అని వ్యాఖ్యానించారు.