CM Revanth Reddy: ప్రేమతో ఏదైనా సాధించవచ్చని సత్యసాయి నిరూపించారు: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:51 AM
సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సత్యసాయిబాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోందని పేర్కొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ,నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. బాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోందని.. వారు మనుషుల్లో దేవుడిని చూశారని చెప్పుకొచ్చారు. పుట్టపర్తి సత్యసాయి శతజయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ (ఆదివారం) బాబా సమాధిని సీఎం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సత్యసాయిబాబా సేవలను గుర్తు చేసుకుంటూ ప్రసంగించారు.
ప్రేమతో ఏదైనా సాధించవచ్చని సత్యసాయి బాబా నిరూపించారని కొనియాడారు. బాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు సత్యసాయి ట్రస్టు నెరవేర్చిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాది భక్తులు నడుస్తున్నారు: మంత్రి నారా లోకేశ్
ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటే..
Read Latest AP News And Telugu News