Share News

Azharuddin: తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఎప్పుడంటే..

ABN , Publish Date - Oct 29 , 2025 | 03:41 PM

తెలంగాణ కేబినెట్‌ని విస్తరించడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేబినెట్‌ని విస్తరించడానికి మార్గం సుగమం చేసింది.

Azharuddin: తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఎప్పుడంటే..
Azharuddin On Telangana Cabinet

హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ కేబినెట్‌ (Telangana Cabinet)ని విస్తరించడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government) సిద్ధమవుతోంది. ఎల్లుండి(శుక్రవారం) ఉదయం 11 గంటలకు కేబినెట్‌ని విస్తరించడానికి మార్గం సుగమం చేసింది.


ఈ క్రమంలో కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ (Azharuddin)ని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది. ఈ నేపథ్యంలోనే మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. అజారుద్దీన్‌కు హోం, మైనారిటీ శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏఐసీసీ ఆదేశాల మేరకు తెలంగాణ కేబినెట్‌ని విస్తరించడానికి రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది.


మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వాలని అనుకున్నాం: మహేష్ కుమార్ గౌడ్

mahesh-kumar-goud.jpg

మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వాలని అనుకున్నామని ఇందులో భాగంగానే అజారుద్దీన్‌ని కేబినెట్‌లోకి తీసుకొంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని ఉద్ఘాటించారు. మైనారిటీని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉందని చెప్పుకొచ్చారు. ఇవాళ(బుధవారం) అజారుద్దీన్ తనను కలిశారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డిని కూడా అజారుద్దీన్ కలుస్తారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మొంథా తుఫాను.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క

ప్రయాణికుడి బ్యాగ్‌లో బుల్లెట్.. భద్రతా సిబ్బంది అలర్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 09:22 PM