Rainfall Updates IN AP: అల్పపీడనం ఎఫెక్ట్.. రాబోయే రెండు రోజులు ఏపీలో వర్షాలే.. వర్షాలు
ABN , Publish Date - Jul 26 , 2025 | 08:24 PM
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజులు పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరకోస్తా తీరం వెంట బలమైన ఈదురు గాలులు ఉంటాయని... ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

విశాఖపట్నం: వాయుగుండం క్రమంగా బలహీనపడి ప్రస్తుతం జార్జండ్ పరిసర ప్రాంతంలో కొనసాగుతుంది. ఇది మరింతగా బలహీన పడుతోందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర బంగాళఖాతంపైన ఉన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిందని వెల్లడించారు. మరోవైపు విదర్బ నుంచి చత్తీస్‌ఘడ్ మీదుగా ఉత్తర బంగాళఖాతం వరకు ద్రోణి కొనసాగుతోందని వివరించారు. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజులు పలుచోట్ల భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ నుంచి అతీ భారీ వర్షాలు పడే ఆవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, ఏలూరు జిల్లాలో ఈరోజు(శనివారం) భారీ నుంచి అతీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తరకోస్తాలో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని... ఒకటి రెండుచోట్ల అతీభారీ వర్షాలు కురుస్తాయని అన్నారు. దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు పడతాయని... ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపారు. ఉత్తరకోస్తా తీరం వెంట బలమైన ఈదురు గాలులు ఉంటాయని... ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు
లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..
Read latest AP News And Telugu News