Share News

Heavy Rains: ఏపీకి బిగ్ అలర్ట్.. రాబోయే నాలుగు రోజుల్లో అతి భారీ వర్షాలు

ABN , Publish Date - Jul 21 , 2025 | 04:14 PM

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతోపాటు ద్రోణి ప్రభావం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Heavy Rains: ఏపీకి బిగ్ అలర్ట్.. రాబోయే నాలుగు రోజుల్లో అతి భారీ వర్షాలు
Heavy Rains in Andhra Pradesh

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో రాబోయే నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతోపాటు ద్రోణి ప్రభావం కొనసాగుతోందని, దీని వల్ల భారీ వానలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.


ఆదివారం వరకూ ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి నైరుతి దిశగా ప్రయాణిస్తోందని వెల్లడించారు. కర్ణాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకూ ద్రోణి ప్రభావం కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే జులై 24వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.


ఈరోజు ఏపీలోని గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, అల్లూరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోనూ వానలు పడతాయని చెప్పారు. దక్షిణ కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు ఉంటాయని.. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చిరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

అజ్ఞాతంలోకి పేర్ని నాని.. గాలిస్తున్న పోలీసులు..

విచారణకు హాజరు కాలేను: మాజీ మంత్రి నారాయణ స్వామి

For More Andhra Pradesh News

Updated Date - Jul 21 , 2025 | 04:51 PM