AP GOVT: ల్యాండ్ పూలింగ్‌పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Jul 21 , 2025 | 02:23 PM
రెండో విడత ల్యాండ్ పూలింగ్‌పై ఎవరూ అభ్యంతరం చెప్పలేదని.. ల్యాండ్ పూలింగ్‌పై వచ్చే కేబినెట్‌లో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. సబ్ కమిటీలో మాట్లాడిన తర్వాత ల్యాండ్ పూలింగ్‌పై ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు.

అమరావతి: రెండో విడత ల్యాండ్ పూలింగ్‌పై (Land Pooling) ఎవరూ అభ్యంతరం చెప్పలేదని.. ల్యాండ్ పూలింగ్‌పై వచ్చే కేబినెట్‌లో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ (Minister Narayana) వ్యాఖ్యానించారు. సబ్ కమిటీలో మాట్లాడిన తర్వాత ల్యాండ్ పూలింగ్‌పై ముందుకెళ్తామని చెప్పుకొచ్చారు. అమరావతి క్యాపిటల్ సిటీలో లీగల్, టెక్నీకల్ సమస్యలు అన్ని పరిష్కరించామని తెలిపారు. ఇవాళ(సోమవారం, జులై 21) అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. రాజధానిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లకు టెండర్లు పిలిచామని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే, మంత్రుల బంగ్లాలు పరిశీలించామని చెప్పారు మంత్రి నారాయణ. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు 12 టవర్లు కేటాయించామని, మొత్తం 288 అపార్టుమెంట్లు అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆలిండియా సర్వీస్ అధికారులకు ఆరు టవర్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ దాదాపు పూర్తయిందని, నాన్ గెజిటెడ్ అధికారుల టవర్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తయిందని వెల్లడించారు. హ్యాపీనెస్ట్‌లో ఆరు టవర్లు ఏర్పాటు అవుతున్నాయని వివరించారు. వచ్చే మార్చ్ 31వ తేదీ లోపు ఆయా నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులని ఆదేశించారు మంత్రి నారాయణ.
ఆలిండియా సర్వీసు అధికారుల టవర్లు ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తి అవుతాయని, ఐకానిక్ టవర్ డిజైన్‌లు కూడా దాదాపు పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు. ఇవాళ నార్మన్ ఫోస్టర్ బృందం అమరావతికి వస్తారని.. వారితో ఐకానిక్ టవర్ డిజైన్లపై చర్చిస్తామని తెలిపారు. 75 కంపెనీలకు భూ కేటాయింపు జరిగిందని, డిసెంబర్ చివరిలోగా అన్ని పనులని పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు. గత జగన్ ప్రభుత్వం రైతులు, కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టిందని మంత్రి నారాయణ విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి
అజ్ఞాతంలోకి పేర్ని నాని.. గాలిస్తున్న పోలీసులు..
విచారణకు హాజరు కాలేను: మాజీ మంత్రి నారాయణ స్వామి
For More Andhra Pradesh News