BJP MP Tejaswi Surya: సీఎం చంద్రబాబుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రశంసలు
ABN , Publish Date - Jun 27 , 2025 | 04:27 PM
ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి సాధిస్తోందని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఉద్ఘాటించారు. రానున్న రోజుల్లో ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని ఎంపీ తేజస్వి సూర్య ధీమా వ్యక్తం చేశారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై (AP CM Chandrababu Naidu) బెంగళూరు సౌత్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య (BJP MP Tejaswi Surya) ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు విజనరీ లీడర్...బాబు విజనరీపై దేశ విదేశాల్లో ప్రశంసల జల్లు కురుస్తోందని కొనియాడారు. ఇవాళ(శుక్రవారం) ఎంపీ తేజస్వి సూర్య విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఎంపీ పాల్గొని మాట్లాడారు.
యోగాంధ్ర కార్యక్రమంతో సరికొత్త రికార్డు సాధించామని.. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ యోగాంధ్రలో పాల్గొని విజయవంతం చేశారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఉద్ఘాటించారు. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి సాధిస్తోందని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య.
ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్‌ని సొంత ఎమ్మెల్యేలే విమర్శిస్తున్నారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఎద్దేవా చేశారు. 2026 తమిళనాడు ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2026లో బీజేపీకి దక్షిణ భారత్‌లో ఒక గొప్ప సమయం రాబోతుందని ఆకాక్షించారు. త్వరలో కేరళలో కూడా బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్లలో అవినీతి, అరాచక పాలనను ఏపీ ప్రజలు చూశారని విమర్శించారు. అందుకే ఒక సమర్థవంతమైన, సుస్థిర కూటమికి అద్భుత మెజార్టీని ప్రజలు ఇచ్చారని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
AP Tourism: పర్యాటక రంగం.. సీఎం సూచనలతోనే ముందుకు: మంత్రి దుర్గేష్
సింగయ్య మృతి కేసు.. జగన్ వాహనం చెకింగ్
Read Latest AP News And Telugu News