AP Heatwave Alert: ఏపీలో పెరుగుతున్న ఎండలు.. ఏపీ ప్రభుత్వం హెచ్చరిక
ABN , Publish Date - Apr 22 , 2025 | 01:45 PM
AP Heatwave Alert: ఏపీలో పెరుగుతున్న ఎండల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ మేరకు సంబంధింత అధికారులకు హోంమత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హోంమత్రి అనిత ఆదేశించారు.

అమరావతి: వాతావరణ మార్పులకు తగ్గట్లుగా అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని హోం మంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇవాళ(మంగళవారం) తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీలో ఎండలు, వడగాలుల తీవ్రతపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులను హోంమంత్రి అనిత అప్రమత్తం చేశారు. వడగాల్పులు, రాబోయే వర్షాకాలానికి సంసిద్ధతపై చర్చించారు. వడదెబ్బ కారణంగా ఏ ఒక్క ప్రాణం పోకూడదని మంత్రి అనిత అన్నారు.
అధికారులకు సూచనలు...
ఈ సందర్భంగా మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. ప్రణాళికతో సమయం నిర్దేశించుకుని ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి వడగాల్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. గతేడాది నంద్యాలలోని గోస్పాడులో అత్యధికంగా 47.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయిందని తెలిపారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2025 ఏప్రిల్‌లో పల్నాడు జిల్లా నరసరావుపేటలో 43.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందని చెప్పారు. 2014,15,16 సంవత్సరాల్లో అత్యధికంగా 49.1, 50.3, 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని మంత్రి అనిత అన్నారు.
అప్రమత్తంగా ఉండాలి...
అలాగే తాగునీటి అవసరాలపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా అప్రమత్తంగా ఉన్నామని సీడీఎంఏ డైరెక్టర్ సంపత్ తెలిపారు. వందరోజుల యాక్షన్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నట్లు సీడీఎంఏ డైరెక్టర్ సంపత్ చెప్పారు. రాబోయే రోజుల్లో వడగాల్పులకు గల అవకాశాలపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీరు నిల్వ చేసినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. 92 మండలాలను ముందస్తుగా గుర్తించి ఆ ప్రాంత ప్రజలకు నీటి కష్టాలు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. పాఠశాలల్లో నీటితో పాటు, ఎన్జీవో, విరాళాల ద్వారా మజ్జిగ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వడగాల్పుల ద్వారా వడదెబ్బ బారిన పడిన వారి చికిత్స కోసం 5,145 పడకలను, 768 అంబులెన్సులు, సిద్ధం చేయడమే కాకుండా వైద్యులకు తగిన శిక్షణ ఇచ్చి అప్రమత్తంగా ఉంచినట్లు వైద్యాశాఖ అధికారి వెల్లడించారు. వడదెబ్బ మరణాలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత అధికారులను ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
YSRCP Leaders: దూకుడు పెంచిన కూటమి సర్కార్.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్
IPS officer Anjaneyulu: కాదంబరి జత్వాని కేసులో మరో ఐపీఎస్ అరెస్ట్
AP NEWS: ఎలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ
High Court: చట్టానికి లోబడే దర్యాప్తు జరగాలి
For More Andhra Pradesh News and Telugu News..