Gajendra Singh Shekhawat: మోదీ విజన్, చంద్రబాబు ప్లానింగ్‌తో ఏపీ అభివృద్ధి
ABN , Publish Date - Jun 26 , 2025 | 04:58 PM
డబుల్ ఇంజన్ సర్కార్‌తో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుని కలిసి పలు ప్రాజెక్ట్‌లపై కూడా చర్చించామని తెలిపారు. ఇరిగేషన్, టూరిజం అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తోందని వెల్లడించారు.

విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్లానింగ్‌తో ఏపీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Union Minister Gajendra Singh Shekhawat) ఉద్ఘాటించారు. గత ఏడాది కాలంగా రూ.450 కోట్లను వివిధ ప్రాజెక్ట్‌ల కింద ఖర్చు చేశామని వెల్లడించారు. టూరిజం శాఖ తరపున ఏడు ప్రాజెక్ట్‌లకు ఈ నిధులు వెచ్చించామని తెలిపారు. ఇవాళ(గురువారం) రాజమండ్రిలో కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పర్యటించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి అఖండ గోదావరి, సైన్స్ సెంటర్, ఫారెస్ట్ అకాడమీకి శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు.
డబుల్ ఇంజన్ సర్కార్‌తో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. చంద్రబాబుని కలిసి పలు ప్రాజెక్ట్‌లపై కూడా చర్చించామని తెలిపారు. ఇరిగేషన్, టూరిజం అభివృద్ధికి కేంద్రప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని అన్నారు. ప్రణాళికాబద్దంగా ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పెహల్గాంలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని చెప్పారు. పర్యాటకులు స్వేచ్ఛగా అక్కడ ప్రాంతాలను సందర్శించవచ్చని తెలిపారు. మరో పదిహేను రోజుల్లో అక్కడ పర్యాటకుల సందడి మొదలవుతుందని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.
ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యంపై అతిపెద్ద దాడి: గజేంద్ర సింగ్ షెకావత్
ఎమర్జెన్సీపై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘1975 జూన్ 25వ తేదీన భారతదేశంలో అత్యవసర పరిస్థితి విధించబడింది. ఇది ప్రజాస్వామ్యంపై అతిపెద్ద దాడి. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అన్ని ప్రాథమిక హక్కులను కాలరాశారు. పత్రికలపై ఆంక్షలు పెట్టి అరాచకాలు వెలుగులోకి రాకుండా అడ్టుకున్నారు. లక్షమందికిపైగా అన్యాయంగా అరెస్టులు చేశారు. ప్రజాస్వామ్యాన్ని నియంతృత్వంగా మార్చారు. సంజయ్ గాంధీ నియంతలా ప్రజల మీద పడి అరాచకాలకు పాల్పడ్డాడు. ప్రజల ఐక్యపోరాటంతో చివరకు ప్రజాస్వామ్యం విజయం సాధించింది. నియంతృత్వానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన కోట్లాది మంది త్యాగాలను ఈ సందర్భంగా దేశం గుర్తుచేసుకుంటుంది. నేటికీ కాంగ్రెస్ ఈ దుశ్చర్యను ఖండించకుండా, పశ్చాత్తాపం లేకుండా ఉండటం చాలా దురదృష్టకరం. జయప్రకాష్ నారాయణ్, వాజ్‌పాయ్, వంటి ఎంతోమంది నేతలు అప్పటి పోరాటాలకు నేతృత్వం వహించారు. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి భారీ మూల్యం చెల్లించిన ఈ చారిత్రాత్మక పోరాటం చేసిన వీరులను దేశం కృతజ్ఞతతో నేడు గుర్తుచేసుకుంటుంది. దేశం వారికి సదాగౌరవం ఇస్తుంది. నేటి తరాలకు ఎమర్జెన్సీ రోజులను వివరిస్తాం’ అని గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు..
For More AP News and Telugu News