Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై అనుచిత పోస్టులు.. ముగ్గురు అరెస్ట్
ABN , Publish Date - Jun 24 , 2025 | 09:07 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ముగ్గురిని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నంలో యోగా దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకరంగా పోస్టులు పెట్టారు.

కాకినాడ జిల్లా: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై (Pawan Kalyan) సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ముగ్గురిని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నంలో యోగా దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకరంగా కొంతమంది వ్యక్తులు పోస్టులు పెట్టారు. ఈ పోస్టులపై జనసేన నేతలు, పవన్ కల్యాణ్ అభిమానులు పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సీరియస్‌గా విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే ముగ్గురు వ్యక్తులను పిఠాపురం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పలువురిని పోలీసులు గుర్తించారు. A2 ఉప్పలగుప్తం మండలం యస్ యానాంకు చెందిన కర్రీ వెంకటసాయి వర్మ, A3 యలమంచిలి మండలం వందలపాకకు చెందిన పాముల రామాంజనేయులు, A4 తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సరూర్‌నగర్‌కి చెందిన షేక్ మహబూబ్ భాషాలను పోలీసులు అరెస్టు చేశారు. A1తో పాటు పలువురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
అమరావతి అభివృద్ధికి మీ అభిప్రాయం చెప్పండి.. ప్రజలకు సీఆర్డీఏ వినతి
జగన్‌పై కేసు.. వైసీపీ నేతలకు నోటీసులు
ఆ ట్వీట్‌కు లోకేష్ క్విక్ రియాక్షన్.. వారికి సీరియస్ వార్నింగ్
Read Latest AP News And Telugu News