Share News

AP Liquor Case : సుప్రీంకోర్టులో లిక్కర్ కేసు నిందితులకు ఊరట

ABN , Publish Date - Nov 26 , 2025 | 01:39 PM

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు నిందితులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టును నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఆశ్రయించారు.

AP Liquor Case : సుప్రీంకోర్టులో లిక్కర్ కేసు నిందితులకు ఊరట
AP Liquor Case

ఢిల్లీ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసు (AP Liquor Case) నిందితులకు సుప్రీంకోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. ఈ కేసులో సుప్రీంకోర్టును నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఆశ్రయించారు. న్యాయస్థానంలో నిందితులు వేసిన పిటిషన్‌పై ఇవాళ(బుధవారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి.


ఈ క్రమంలో సరెండర్ నుంచి నిందితులకు మినహాయింపు ఇచ్చింది న్యాయస్థానం. 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని సిట్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రిజైండర్ దాఖలు చేసేందుకు ఐదు రోజుల సమయం కోరారు నిందితుల తరపు న్యాయవాదులు. డిసెంబరు 15వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది. ఇటీవల లిక్కర్ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును లిక్కర్ కేసు నిందితులు ఆశ్రయించిన విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజ్యాంగ విలువలను కాపాడుకుంటాం:సీఎం చంద్రబాబు

మాక్ అసెంబ్లీ అద్భుతం.. విద్యార్థులు అదరగొట్టారు: సీం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 26 , 2025 | 01:48 PM