Home » Supreme Court
పెగాసస్ స్పైవేర్‌ను తమపై ఉపయోగించినట్టు ఎవరైనా అనుమానిస్తే వారు కోర్టును ఆశ్రయించవచ్చని, నిజంగానే వారిని టార్గెట్ చేశారా లేదా అనే దానిపై సమాచారం అందిస్తామని ధర్మాసనం తెలిపింది. సాంకేతిక బృందం నివేదక అనేది వీధుల్లో చర్చించుకునే ఓ డాక్యుమెంట్ కాదని స్పష్టం చేసింది.
సిబిఐ అధికారి రాంసింగ్‌తో సహా సునీత దంపతులపై దాఖలైన కేసులో తాజా దర్యాప్తు నివేదికను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అందజేసింది. రాంసింగ్, సునీత దంపతులపై కావాలనే కేసు పెట్టారని, అవినాశ్ రెడ్డే ఇద్దరు పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని ఈ తతంగం అంతా నడిపారని ఆ నివేదికలో ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
మావోయిస్టు నేత ఆజాద్‌పై కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారా అని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒడిసాలో 37 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు నివేదిక ఇచ్చారు.
మద్యం కుంభకోణం కేసులో మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, దీనిపై ఉన్న ఉద్రిక్తత దేశ సరిహద్దుల్లోనూ లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సీనియర్ న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది
తెలంగాణలో న్యాయాధికారులుగా అర్హత సాధించేందుకు తెలుగులో ప్రావీణ్యాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీం కోర్టు సోమవారం నిరాకరించింది.
గతంలో విచారణ సందర్భంగా అల్హాబాదియా విదేశీ ప్రయాణాలపై నిషేధం విధిస్తూ, పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో తన పాస్‌పోర్ట్‌ను రిలీజ్ చేయాలని అల్హాబాదియా సుప్రీంకోర్టుకు తిరిగి అశ్రయించారు.
సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు రాహుల్ గాంధీకి తీవ్రంగా మండిపడింది. దేశ చరిత్ర తెలియకుండా సమరయోధులను అపహాస్యం చేయడం అనుచితమని హెచ్చరించింది.
వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వొద్దని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది
ఇటీవల మోదీ సర్కారు ఆమోదించిన వక్ఫ్ బిల్లు చట్టభద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దీంతో మోదీ సర్కారుకు ఉపశమనం లభించినట్లైంది.
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కోర్టులో ఇవాళ కూడా వాదనలు వాడివేడిగా జరిగాయి. పార్లమెంట్ చేసిన ఈ చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని కేంద్రం సుప్రీంకు తెలిపింది.