SC Takes up Indigo Flight Crisis: ఇండిగో సంక్షోభంపై సుప్రీంకోర్టులో పిటిషన్.. సీజేఐ నివాసంలో విచారణ.!
ABN , Publish Date - Dec 06 , 2025 | 10:50 AM
ఇండిగో సంక్షోభం కేసు సుప్రీం కోర్టుకు చేరింది. ఇండిగో సంస్థ ఎఫ్డీటీఎల్ నియమాలను ఉల్లంఘించిందని పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై సీజేఐ నివాసంలో విచారణ జరగనున్నట్టు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో అంతరాయం(IndiGo Crisis) ఏర్పడి.. ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ కేసు సుప్రీంకోర్టు(Supreme Court)కు చేరింది. విమానాలు రద్దై, ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారని న్యాయస్థానంలో పిటిషన్ ధాఖలైంది. ఈ పిల్‌ను సుప్రీం ధర్మాసనం స్వయంగా విచారణ చేపట్టి.. స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా పౌరవిమానయాన మంత్రిత్వశాఖ(Aviation Ministry), డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA)లను ఆదేశించాలని పిటిషనర్ అభ్యర్థించారు. ఇండిగో సంస్థ.. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్(FDTL) నియమాలను అమలు చేయడంలో విఫలం కావడంతో విమానాలు రద్దయ్యాయని పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో ఇండిగో ప్రయాణికుల హక్కులను ఉల్లంఘించిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇండిగో విమానాల సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకుంది సుప్రీం ధర్మాసనం. ఈ విషయమై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్(CJI Justice Suryakanth).. అత్యవసర విచారణ కోసం పిటిషనర్ న్యాయవాదిని తన నివాసానికి పిలిపించి మాట్లాడనున్నట్టు సమాచారం.
ఇవీ చదవండి: