Lokesh: మెగా డీఎస్సీ నోటీఫికేషన్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:05 AM
Mega DSC Notification: ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదివారం నాడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం..

అమరావతి: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఏపీ ప్రభుత్వం పండుగ లాంటి శుభవార్త తెలిపింది. ఏపీ ప్రభుత్వం ఇవాళ(ఆదివారం) ఉదయం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ ఫైలుపైనే ముఖ్క్ష్యమంత్రి నారా చంద్రబాబు నాయడు తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇవాళ చంద్రబాబు 75వ జన్మదినోత్సవం సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు ఈ తీపి కబురు చెప్పింది. దానిలో భాగంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల ద్వారా మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్నామని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదల చేశామని ప్రకటించారు. ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సుమారు 13,192 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎస్జీటీ , స్కూల్ అసిస్టెంట్‌తో పాటు 52 ప్రిన్సిపాల్, 273 పీజీటీ, 1718 టీజీటీ పోస్టులను రాష్ట్ర, జోన్ స్థాయి కోటాలో భర్తీ చేయనున్నాట్లు ప్రకటించారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే...
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అన్ని వివరాలు cse.ap.gov.in, apdsc.apcfss.in లో పొందుపరిచామని చెప్పారు. అప్లై చేసుకోవాలని భావించే అభ్యర్ధులు ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు సీబీటీ విధానంలో ఈ పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు. మెగా డీఎస్సీ -2025 పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్షా షెడ్యూలు, సిలబస్, నోటిఫికేషన్, హెల్ప్‌డెస్క్ వివరాలు సంబంధిత వెబ్‌సెట్‌లో అందుబాటులో ఉంటాయని లోకేష్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులందరికీ మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ సజావుగా సాగడానికి మంత్రి నారా లోకేష్ వీడియో విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Megastar Chiranjeevi: సీఎం చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్
సీఎం చంద్రబాబుకు గవర్నర్, పవన్ జన్మదిన శుభాకాంక్షలు
Narayana Team: గుజరాత్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన
AP High Court: అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని ఆదేశించలేం
For More AP News and Telugu News