Home » NDA Alliance
గడ్కరీలో వేగం, అంకిత భావం, చిత్తశుద్ది ఆయనకు మాత్రమే సాధ్యమని ఏపీ సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్రమోదీ దూరదృష్టితో రోడ్లకు రూపం ఇస్తే దాన్ని గడ్కరీ ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు.
గత జగన్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందినా సరైన విధంగా స్పందించలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో రవాణా లేని ఏజెన్సీ ప్రాంతాలను రోడ్లతో కలుపుతున్నామని.. అక్కడ డోలీ మోతలు లేకుండా చేశామని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. టెక్నాలజీకి అనుగుణంగా ఆధునీకికరణ పరికరాలు కూడా రైతులకు అందజేస్తున్నామని వివరించారు. నేడు డ్రోన్ ఉపయోగించి, రైతులు వ్యవసాయం చేస్తున్నారని అన్నారు.
దేశంలో అవినీతి రహిత పాలన ఉండాలని ప్రజలు భావించి తమను గెలిపిస్తున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశాన్ని పాలించగల సత్తా ఉందని ప్రజలు భావించి బీజేపీకి విజయాన్ని అందించారని చెప్పారు.
విజయవాడ పోలీసు కమిషనర్‌ని ఎన్డీఏ కూటమి మహిళా నేతలు సోమవారం కలిశారు. సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజుపై సీపీకి ఫిర్యాదు చేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని మహిళలను అభ్యతరకరంగా ధూషించిన కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ సీపీకి వినతి పత్రం ఇచ్చారు.
జగన్ హయాంలో నిధులు పక్కదారి పట్టాయని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆరోపించారు. ఏపీకి తీరని నష్టం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన NDA ముఖ్యమంత్రులు , ఉపముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. స్థానిక అశోకా హోటల్‌లో మధ్యాహ్నం 3 వరకు ఈ సమావేశం జరగనుంది.
Sajjala Ramakrishna Reddy: వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ భూ ఆక్రమణలపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కడప జిల్లాలోని సీకేదిన్నె మండలంలో సజ్జల ఎస్టేట్‌లో భూఆక్రమణలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.
Minister Anagani Satya Prasad: కూటమిలో ఉన్న పార్టీల్లోని కార్యకర్తలకూ ఏదోక సమయంలో తప్పకుండా అవకాశం వస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రతి ఒక్కరినీ బాగా చూసుకునే బాధ్యత తమదని మంత్రి అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు.
విశాఖపట్నం జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోవిందరెడ్డి నాయకత్వాన్ని ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు.