Share News

Piyush Goyal: బిహార్‌ ప్రజలు మోదీపై మరోసారి విశ్వాసం చూపించారు: పీయూష్ గోయల్

ABN , Publish Date - Nov 14 , 2025 | 11:51 AM

బిహార్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై నమ్మకం ఉంచి, ఎన్డీఏకు పట్టం కడుతున్న బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

Piyush Goyal: బిహార్‌  ప్రజలు  మోదీపై మరోసారి విశ్వాసం చూపించారు: పీయూష్ గోయల్
Piyush Goyal

విశాఖపట్నం ,నవంబరు14 (ఆంధ్రజ్యోతి): బిహార్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై బిహార్ ప్రజలు మరోసారి విశ్వాసం చూపించారని ఉద్ఘాటించారు. మోదీపై ప్రజలు విశ్వాసం ఉంచారనడానికి బిహార్‌లో వస్తున్న ఫలితాలే నిదర్శనమని నొక్కిచెప్పారు. బిహార్ ఎన్నికల ఫలితాలు కూడా వస్తున్నాయని.. ప్రజలు భారీ విజయం అందిచబోతున్నారని జోస్యం చెప్పారు.


ప్రధాని మోదీపై నమ్మకం ఉంచి, ఎన్డీఏకు పట్టం కడుతున్న బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఇవాళ(శుక్రవారం) విశాఖపట్నంలోని సీఐఐ పెట్టుబడుల సదస్సులో పీయూష్ గోయల్ పాల్గొని ప్రసంగించారు. ఎన్డీఏ కూటమి 181 సీట్లు సాధించటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బిహార్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు పీయూష్ గోయల్.


ఈ వార్తలు కూడా చదవండి...


ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. డీఎన్ఏ అతడిదే..

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. ఉమర్ బంధువు అరెస్ట్..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 14 , 2025 | 11:57 AM