Home » Piyush Goyal
డెడ్‌లైన్‌లను దృష్టిలో పెట్టుకుని ఏ దేశంతోనూ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోబోమని కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికా ప్రతీకార సుంకాల విధింపునకు డెడ్‌లైన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక కారిడార్లలో ఎంఎస్ఎంఈలు, స్టార్ట్‌పల కోసం ప్రత్యేక జోన్లను కేటాయించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధికారులను ఆదేశించారు.
ఏపీ సీఎం చంద్రబాబు వినియోగించే హెలీకాప్టర్‌లో తరచుగా సమస్యలు వస్తున్నాయి. ఇవాళ మరోసారి సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కి ఈ హెలీకాప్టర్‌ని ఏపీ పర్యటన నిమిత్తం కేటాయించారు. కేంద్రమంత్రి కృష్ణపట్నం పోర్టుకి వెళ్లడానికి హెలికాప్టర్ ఎక్కిన సమయంలో మొరాయించడంతో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.
రాష్ట్రంలో అనుమతించిన విస్తీర్ణంలోనే పొగాకు సాగు జరిగేలా అధికారులు పర్యవేక్షించాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆదేశించారు. చాలా చోట్ల అదనంగా పొగాకు సాగు చేస్తుండటం వల్ల సమస్యలు...
గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయానికి చేరుకున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు కేంద్రమంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి భరత్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పొగాకు బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
భారతదేశం, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక రంగంలో తమ వ్యాపార సహకారాన్ని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో ఇరు దేశాలు ముందుకు సాగుతున్నాయి. అందుకు సంబంధించిన చర్చల (India US Trade Talks) గురించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
CAIT Letter To Piyush Goyal: కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ లేఖ రాసింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారాలపై పాకిస్థాన్ జెండాలు, లోగోలు ఉన్న వస్తువులు విక్రయమవుతున్నట్టు సమాచారం ఉందని పేర్కొంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు 2.55 బిలియన్ డాలర్ల విలువైన సీ ఫుడ్ ఎగుమతి అయ్యిందని సీఎం చంద్రబాబు తెలిపారు. వీటిలో రొయ్యలే 92 శాతం వాటా కలిగి ఉన్నట్లు చెప్పారు. కానీ, ప్రస్తుతం అమెరికా సుంకాలతో ఆక్వా రంగం ఇబ్బందులు పడుతోందని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్‌లో ఈ నెల 26న నిర్వహించబోయే బయో ఏషియా-2025 సదస్సుకు రావాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు.
నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు శుభ పరిణామమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ అన్నారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయని.. ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.