Piyush Goyal: ఏపీ పారిశ్రామిక కారిడార్లలో ప్రత్యేక జోన్లు
ABN , Publish Date - Jun 18 , 2025 | 06:25 AM
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక కారిడార్లలో ఎంఎస్ఎంఈలు, స్టార్ట్‌పల కోసం ప్రత్యేక జోన్లను కేటాయించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధికారులను ఆదేశించారు.

ఎంఎస్ఎంఈలకు, స్టార్ట్‌పలకు కేటాయించాలి
పెట్టుబడిదారులను ఆకర్షించే వాతావరణం కల్పించాలి
అధికారులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆదేశం
న్యూఢిల్లీ, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక కారిడార్లలో ఎంఎస్ఎంఈలు, స్టార్ట్‌పల కోసం ప్రత్యేక జోన్లను కేటాయించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధికారులను ఆదేశించారు. ప్రతి పారిశ్రామిక ప్రాంతంలో ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా పెట్టుబడిదారులను, స్టార్టప్ సంస్థలను ఆకర్షించాలని చెప్పారు. బలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్ కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఐసీడీసీ) నేతృత్వంలోని పారిశ్రామిక నోడ్‌ల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలను మంత్రి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాజెక్టుల పురోగతిని ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి కేంద్రీకృత డాష్‌బోర్డ్ ఏర్పాటు చేయాలన్నారు.