CM Chandrababu: అభివృద్ధిని ఆకాంక్షించి బిహార్ ప్రజలు ఎన్డీఏకు పట్టం కట్టారు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:14 PM
బిహార్ ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని అందిస్తున్న బిహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం కట్టారని ఉద్ఘాటించారు.
విశాఖపట్నం,నవంబరు14 (ఆంధ్రజ్యోతి): బిహార్ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కడుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా బిహార్ ప్రజలకు అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రజలు పూర్తిస్థాయిలో నమ్మకం ఉంచారని చెప్పుకొచ్చారు. బిహార్ ఎన్నికల ఫలితాల్లో అభివృద్ధిని ఆకాంక్షించి ప్రజలు పట్టం కట్టారని ఉద్ఘాటించారు. ప్రపంచవ్యాప్తంగా అనేక విషయాల్లో భారత్ అగ్రగామిగా ఉందని తెలిపారు. అందుకే ప్రజలు ఎన్డీఏకు పట్టం కడుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇవాళ(శుక్రవారం) విశాఖపట్నంలోని సీఐఐ పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.
బిహార్‌లో దూసుకెళ్తున్న ఎన్డీఏ కూటమి
కాగా, ఎన్డీఏ కూటమి బిహార్‌లో దూసుకెళ్తోంది. గత ఫలితాలకంటే అధిక స్థానాలు కైవసం చేసుకునే దిశగా బీజేపీ, జేడీయూ వెళ్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఘోరమైన పరాభవాన్ని మూటగట్టుకుంటుంది మహాఘట్ బంధన్. అయితే, గతంలో మహాఘట్ బంధన్ సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే. ఈసారి 50 మార్క్ దాటడం కూడా కష్టంగానే ఉంది. బిహార్‌లో ఎక్కడా SIR ప్రభావం పనిచేయలేదు. ఓటు చోరీని బిహార్ ప్రజలు పట్టించుకోలేదు. బిహార్ ఎన్నికల ఫలితాలపై పూర్తి నిరాశలో కాంగ్రెస్ కూరుకుపోయింది. రాబోయే రౌండ్లలో ఫలితం మారుతుందని కాంగ్రెస్ నేతలు నమ్మకంతో ఉన్నారు. అయితే, బిహార్‌లో అధికారం తమదేనని కాంగ్రెస్ సీనియర్ నేత తారిఖ్ అన్వర్ చెప్పడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి...
దేశానికి గ్రోత్ ఇంజన్‌గా ఏపీ: మంత్రి నారా లోకేష్
విశాఖలో 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం
Read Latest AP News And Telugu News