PVN Madhav: ఫార్మా, ఐటీకి.. ఏపీ హబ్‌గా మారబోతోంది: మాధవ్
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:48 PM
ఏపీ పురోగతి చెందడానికి, దేశంలోనే ప్రథమ స్థానానికి రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వివరించారు. రాయలసీమను ఒక పవర్ హౌస్‌గా అభివృద్ధి చేయనున్నారని చెప్పుకొచ్చారు.
విజయవాడ, డిసెంబరు7 (ఆంధ్రజ్యోతి): ఫార్మా, ఐటీకి.. హబ్‌గా ఏపీ మారబోతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (AP BJP President PVN Madhav) వ్యాఖ్యానించారు. దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ శతజయంతి కార్యక్రమాల కోఆర్డినేషన్‌కు ఒక వార్ రూమ్‌ను ప్రారంభించామని పేర్కొన్నారు. ఇవాళ(ఆదివారం) విజయవాడలో మాధవ్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు పీవీఎన్ మాధవ్.
వాజ్‌పేయీ శతజయంతి కార్యక్రమాలకు మొదటి రోజున మధ్యప్రదేశ్ సీఎం మోహన్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్‌లను ఆహ్వానించామని తెలిపారు. వాజ్‌పేయీ స్మృతివనం నిర్మిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. కూటమి పాలనకు వాజ్‌పేయీ ఒక నిదర్శనంగా ఉంటారని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి వాజ్‌పేయీ ఆద్యుడని వ్యాఖ్యానించారు. వాజ్‌పేయీ శతజయంతి సందర్భగా ఆయన విగ్రహాలను ఏపీ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
ఏపీ పురోగతి చెందడానికి, దేశంలోనే ప్రథమ స్థానానికి రావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయని వివరించారు. రాయలసీమను ఒక పవర్ హౌస్‌గా అభివృద్ధి చేయనున్నారని చెప్పుకొచ్చారు. టెలికాం అత్యంత చౌకగా ఉండటానికి కారణం వాజ్‌పేయీ అని తెలిపారు. ఈ నెల 11వ తేదీన ధర్మవరంలో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి బిగ్ షాక్.. కాకాని గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు
విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తాం: పవన్ కల్యాణ్
Read Latest AP News and National News