Share News

CM Chandrababu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు

ABN , Publish Date - Apr 22 , 2025 | 03:47 AM

విదేశీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం ఆయన కేంద్ర మంత్రులు సీఆర్ పాటిల్, అర్జున్ రామ్ మేఘవాల్, అమిత్ షా లతో భేటీ కానున్నారు.

 CM Chandrababu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు

నేడు అమిత్‌ షా, పలువురు

కేంద్ర మంత్రులతో భేటీ

అమరావతి/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీ విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి తన అధికారిక నివాసం 1 జన్‌పథ్‌కు చేరుకుని, రాత్రి అక్కడే బస చేశారు. మంగళవారం ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఉదయం 10.30 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను, 11.30కి కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, మధ్యాహ్నం 2గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యే అవకాశముంది.

చంద్రబాబుకు ఘన స్వాగతం

ఢిల్లీ విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు ఘనస్వాగతం లభించింది. కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు, టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్వాగతం పలికారు. అప్పలనాయుడు, ఆయన సతీమణి ప్రభా నాయుడు అరసవెల్లి సూర్యనారాయణస్వామి దేవస్థానం తీర్థప్రసాదాలు అందజేశారు.


పోప్‌ ఫ్రాన్సిస్‌ మృతికి సీఎం సంతాపం

పోప్‌ ఫ్రాన్సిస్‌ మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం తెలిపారు. ఆయన సోమవారం ఎక్స్‌లో స్పందిస్తూ... ‘ప్రపంచ ప్రజలను ప్రేమ, దయాగుణం దిశగా నడిపిన ఓ మహావ్యక్తి పోప్‌ ఫ్రాన్సిస్‌. ఆయన మృతి ప్రపంచ క్యాథలిక్‌ సమాజానికి తీరని లోటు’ అని పేర్కొన్నారు. మంత్రి లోకేశ్‌ కూడా పోప్‌ ఫ్రాన్సిస్‌ మృతికి సంతాపం తెలిపారు. పోప్‌ లక్షలాది మంది జీవితాలకు మార్గదర్శనం చేశారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..

10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..

Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం

Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.

RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 10:53 AM