Share News

ANAGANI Satya Prasad: జగన్ అండ్ కో కుట్రలు, కుతంత్రాలతో రగిలిపోతున్నారు: మంత్రి అనగాని

ABN , Publish Date - Nov 24 , 2025 | 02:02 PM

సీఎం చంద్రబాబు తన విజనరీతో అన్నతాతలకు పంచ సూత్రాలను అందిస్తున్నారని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. పంచ సూత్రాల ద్వారా రైతులు తమ ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్‌తో పోటీ పడతారని పేర్కొన్నారు.

ANAGANI Satya Prasad: జగన్ అండ్ కో కుట్రలు, కుతంత్రాలతో రగిలిపోతున్నారు: మంత్రి అనగాని
ANAGANI Satya Prasad

అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ (AP Minister ANAGANI Satya Prasad) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అండ్ కోకు కుట్రలు, కుతంత్రాలతో పాటు కుళ్లు, ఈర్ష్య, అసూయలు బాగా పెరిగిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఇవాళ(సోమవారం) అమరావతి వేదికగా మీడియాతో మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు సంతోషంగా ఉంటే ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. పంచ సూత్రాల పేరుతో తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు మంత్రి అనగాని సత్యప్రసాద్.


తమ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి అసూయతో జగన్ అండ్ కో రగిలిపోతున్నారని దెప్పిపొడిచారు. జగన్ రెడ్డి పాలనలో రైతులకు ఆత్మహత్యలే శరణ్యమయ్యాయని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏడాదికి సగటున 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


సీఎం చంద్రబాబు తన విజనరీతో రైతులకు పంచ సూత్రాలను అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. పంచ సూత్రాల ద్వారా రైతులు తమ ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్‌తో పోటీ పడతారని వివరించారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతులు రారాజులగా మారతారని చెప్పుకొచ్చారు. దీన్ని తట్టుకోలేకే జగన్ పంచ సూత్రాలపై పడి పడి ఏడుస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నా తల్లి ఆరోగ్య పరిస్థితిపై దుష్ప్రచారం చేస్తున్నారు: ఎంపీ రమేష్‌

జగన్ హయాంలో రైతులు నష్టపోయారు.. ఎంపీ కలిశెట్టి ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 24 , 2025 | 02:09 PM