Share News

Pawan Kalyan: మంత్రి నారా లోకేష్‌ను ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్

ABN , Publish Date - Jul 24 , 2025 | 05:15 PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా మంత్రులు అభినందనలు తెలిపారు. మంత్రి నారా లోకేష్‌ను ఆలింగనం చేసుకుని పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు చెప్పారు.

Pawan Kalyan: మంత్రి నారా లోకేష్‌ను ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్
AP Cabinet Congratulates Pawan Kalyan

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన సినిమా హరిహర వీరమల్లు విడుదల (Hari Hara Veera Mallu movie) సందర్భంగా మంత్రులు అభినందనలు తెలిపారు. మంత్రి నారా లోకేష్‌ను (Nara Lokesh) ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు చెప్పారు పవన్ కల్యాణ్. కేబినెట్ మీటింగ్ ముందు పవన్‌ను పిలిచి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అభినందనలు తెలిపారు.


హరి హర వీర మల్లు సినిమాను వీక్షించిన ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్

PAWAN-MADAV.jpg

మరోవైపు.. విశాఖపట్నం మద్దిలపాలెంలోని కిన్నెర కామేశ్వరి థియేటర్‌లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీర మల్లు సినిమాను ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ వీక్షించారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడారు. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన మొదటి సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. పవన్ కల్యాణ్ అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారని కొనియాడారు పీవీఎన్ మాధవ్.


ప్రేక్షకులను రంజింప చేయడానికే కాకుండా ఆలోచింపచేయడానికి ఈ చిత్రం తీశారని అభివర్ణించారు. ఈ సినిమాలో మల్లయుద్ధం హైలెట్ అని... అన్నివర్గాల ప్రజలను పవన్ కల్యాణ్ మెప్పించారని చెప్పుకొచ్చారు. ఔరంగజేబు చేసిన అకృత్యాలు దాష్టికాలను ఈ చిత్రంలో బాగా చూపించారని కొనియాడారు. జిజియా పన్ను కట్టకపోతే ముస్లిమేతరులను వేధించిన తీరును బాగా చూపించారని ఉద్ఘాటించారు. మత సామరస్యాన్ని దెబ్బతీసిన ఔరంగజేబుపై సినిమా చేయడం చాలా సాహసమని నొక్కిచెప్పారు. భారతదేశ కీర్తి ప్రతిష్టలను నిలబెట్టిన వీరుల కథలను సినిమాగా తీసినందుకు పవన్ కల్యాణ్‌ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని తెలిపారు. ఎంతో కష్టపడి తీసిన ఈ మూవీని ప్రేక్షకులు ఆదరించాలని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

YS Sharmila: మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 24 , 2025 | 05:56 PM